BigTV English

Athadu Sequel: అతడు సీక్వెల్ పై నిర్మాత క్లారిటీ.. త్వరలోనే సెట్ పైకి!

Athadu Sequel: అతడు సీక్వెల్ పై నిర్మాత క్లారిటీ.. త్వరలోనే సెట్ పైకి!

Athadu Sequel: ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ హవా ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈమధ్య ఒక సినిమా వచ్చి హిట్ అయింది అంటే.. కచ్చితంగా ఆ సినిమా సీక్వెల్ పై అటు దర్శక నిర్మాతలు, ఇటు హీరోలు పనిచేస్తున్నారు. అంతేకాదు గతంలో విడుదలైన చిత్రాలకి కూడా ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్ లో క్లాసిక్ మూవీగా నిలిచిన ‘అతడు’ సినిమా సీక్వెల్ కి సర్వం సిద్ధం అయ్యింది అని, నిర్మాత చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.


రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న అతడు మూవీ..

అసలు విషయంలోకి వెళ్తే.. జయభేరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీమోహన్ (Murali mohan) నిర్మాణంలో త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అతడు (Athadu ). ఇందులో మహేష్ బాబు (Mahehababu) హీరోగా , త్రిష (Trisha) హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పుడు యావరేజ్ గా నిలిచినా.. ఆ తర్వాత కాలంలో క్లాసిక్ సినిమాగా పేరు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఆగస్టు 9వ తేదీన రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మేరకు చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో మురళి మోహన్ అతడు సీక్వెల్ పై స్పందించారు. ప్రెస్ మీట్ లో భాగంగా అతడు పార్ట్ 2 తెరకెక్కించే ఆలోచన ఉందా? తీస్తే ఎవరితో సినిమా చేస్తారు? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.


వారు కోరితే సీక్వెల్ తప్పనిసరి – మురళీమోహన్

దీనిపై మురళీమోహన్ మాట్లాడుతూ.. “అతడు సినిమా సీక్వెల్ తీస్తే మళ్లీ త్రివిక్రమ్, మహేష్ బాబు తోనే చేస్తాను. ఇంకొకరిని మార్చను. మారిస్తే జనాలు ఒప్పుకోరు కదా.. అటు త్రివిక్రమ్ ఇటు మహేష్ బాబు ఇద్దరూ డేట్స్ ఇస్తే కచ్చితంగా జయభేరి సంస్థ ఆ సినిమాను నిర్మిస్తుంది. నిజానికి సీక్వెల్ కి కథలో అవకాశం ఉంది. అప్పట్లో పార్ట్ 2 లు లేవు కాబట్టి సినిమా అంతటితో ఆగిపోయింది.. కానీ ఇప్పుడు తీస్తే మాత్రం ఇది కచ్చితంగా మంచి సబ్జెక్ట్ అవుతుంది.. పైగా మంచి కాంబినేషన్ కూడా.. ఇప్పుడు రీ రిలీజ్ చూసిన తర్వాత అభిమానులు కచ్చితంగా పార్ట్ 2 కావాలి అని కోరితే.. కచ్చితంగా ఈ సినిమా సెట్ పైకి వెళ్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వారి డేట్స్ కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాను” అంటూ మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. ఇక మొత్తానికైతే అభిమానులు కోరడమే తరువాయి.. త్వరలోనే సెట్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది అన్నట్లుగా మురళీమోహన్ ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారు. మరి ఈ సినిమా సీక్వెల్ వస్తే ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆ అంశాలకు కొనసాగింపుగా అతడు సీక్వెల్..

ఇకపోతే అతడు సినిమా చివర్లో పూర్తి ఎండింగ్ ఇవ్వకుండానే సినిమాలు వదిలేశారు.. ఆ కేసు అని ఇప్పుడు ఎలా క్లోజ్ చేశారు? హీరో మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడా? వెళ్తే అక్కడ వారు ఆ హీరోని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనే సందేహాలు కచ్చితంగా సినిమా చూసే ఆడియన్ లో కలుగుతాయి.. మరి అక్కడి నుంచి కథ మొదలుపెడితే మాత్రం కచ్చితంగా సీక్వెల్ హిట్ అవుతుందని చెప్పవచ్చు.

ALSO READ:Balakrishna: గొప్ప మనసు చాటుకున్న బాలయ్య.. అభిమాని కోసం ఏం చేశారో తెలిస్తే షాక్!

Related News

Big Breaking: సీనియర్ హీరోయిన్ రాధికా తల్లి మృతి!

Rithu Chowdhary: హీరో బెడ్ రూంలో రీతు చౌదరి.. వీడియోతో బట్టబయలైన ఎఫైర్

OG Trailer: ఓజీ ట్రైలర్ రిలీజ్.. హీరో కంటే ఆయనకే ఎక్కువ హైప్ ఇచ్చినట్టున్నారే?

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

Big Stories

×