BigTV English

Shivamogga bridge: కాస్త టైమ్ ఉందా? ఈ కేబుల్ బ్రిడ్జిపై జర్నీ ప్లాన్ చేసేయండి!

Shivamogga bridge: కాస్త టైమ్ ఉందా? ఈ కేబుల్ బ్రిడ్జిపై జర్నీ ప్లాన్ చేసేయండి!

Shivamogga bridge: ఓ సారి వెళ్లి చూస్తే, ఇది బ్రిడ్జ్ కాదు బాస్.. నదిపై వేలాడుతూ కళ్ళు చెదిరేలా మెరిసే అందం. అరే ఇది మన దేశంలో ఉందా అనే తరహాలో మనకు అనిపించేలా ఉంటుంది. అలా ఒక్కసారి చూస్తే.. ఇన్ స్టా స్టోరీలకు, డ్రోన్ షాట్లకి, జ్ఞాపకాలకు.. ఇదే బెస్ట్ డెస్టినేషన్!


నదిపై వేలాడే అద్భుతం
ఇటీవలే ఓ అద్భుతమైన బ్రిడ్జి ఓపెన్ అయ్యింది. పొడవు ఏకంగా 6 కిలోమీటర్లు. కానీ నిజంగా కళ్ళతో చూడకుండా, వింటే నమ్మలేం. మధ్యలో ఉన్న బలమైన పిల్లర్లకి స్టీల్ కేబుల్స్‌తో వేలాడేలా తీర్చిదిద్దిన ఈ బ్రిడ్జి ఇప్పుడు టూరిజంలో ఓ కొత్త చాప్టర్ తెరిచింది. ఇది కేవలం రోడ్డు కాదు.. రొమాన్స్, ఆర్కిటెక్చర్, ఆవిష్కరణలతో తయారైపోయింది!

బ్రిడ్జ్ మీద నుంచి డ్రైవ్ చేస్తే.. అదో వింత అనుభూతి!
మీరు ఎప్పుడైనా నదిపై ఆకాశంలో నడిచినట్లు ఫీల్ అయ్యారా? అయితే ఈ బ్రిడ్జ్ మీద కారులో వెళ్లేటప్పుడు కచ్చితంగా ఆ ఫీలింగ్ వస్తుంది. బ్రిడ్జ్ ఎత్తులో ఉంది. దాని కేబుల్స్ ఆకాశంలోకి పైకి లేచినట్లు ఉంటాయి. పక్కనే నది. పొదల మధ్య పచ్చని ప్రకృతి. వామ్మో.. ఏ షాట్ తీసినా వందల లైక్స్ వచ్చేస్తాయి.


రాత్రిపూట అయితే..
ఈ బ్రిడ్జికి నైట్ టైమ్ స్పెషల్ లైటింగ్ ఉంది. అలాంటి బ్రిడ్జి మీద నడవటం, ఫోటోలు తీయడం అంటే.. మనసు మొత్తానికి ఓ మైండ్ బ్లాంక్ టైం. మీరు జంటగా వెళ్తే, ఇది మీకు లైఫ్‌ టైమ్ మెమొరీ. ఫ్యామిలీ ట్రిప్ అయితే పిల్లలు, పెద్దలు అందరూ ఆనందించేది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు.

Also Read: Telangana Maldives: తెలంగాణలో మాల్దీవులు.. ఇక్కడికి వెళ్లారంటే.. ఇట్టే ప్రేమించేస్తారు!

ఇక్కడికి రావాలి అనిపించే ఇంకో మంచి రీజన్..
ఈ బ్రిడ్జి వల్ల పలు గ్రామాల ప్రజలకు కనెక్టివిటీ బాగా పెరిగింది. అలాగే, పక్కన ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్లే భక్తులకు ఇది కొత్త మార్గం. అందులో నదిని బోటులో దాటి వెళ్లే అవసరం లేదు.. నేరుగా ఈ బ్రిడ్జి మీద వెళ్లొచ్చు.

ఇంత అందం ఎలా కట్టారు అంటే.. కథే వేరుగా ఉంది!
ఈ ప్రాజెక్ట్‌కు రూ.472 కోట్లు ఖర్చయింది. నిర్మాణానికి 3 సంవత్సరాలు పట్టింది. కానీ ఒక్కసారి చూస్తే.. మీకు ఆ నిర్మాణం వెనుక ఉన్న వింతలు, విశేషాలు ఇట్టే తెలుస్తాయి. ఎందుకంటే ఇది కేవలం రోడ్డు కాదని, మన దేశ ఇంజినీరింగ్‌కి ఉన్న టాలెంట్‌ని చెప్పే బ్రాండ్ అయిపోయింది. మన దేశంలో ఇలాంటి బ్రిడ్జ్ ఉందని చెప్పుకోవడానికే గర్వంగా ఉంటుంది. మన ఇంజినీర్లు విదేశీ టెక్నాలజీకి ఏమాత్రం తగ్గకుండా ఎంతో నిపుణతతో తీర్చిదిద్దారు. ఇది మన మేధస్సు, శ్రమ ఫలితంగా వెలుగులోకి వచ్చిన అద్భుతంగా చెప్పవచ్చు.

ట్రిప్ ప్లాన్ చేయడం ఆలస్యం చేయకండి!
ఒక్కరోజు ప్రయాణం ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్‌తో అయితే ఫన్నీ ట్రిప్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే బ్యూటిఫుల్ జర్నీ అవుతుంది. బ్రిడ్జి మీద స్టాపయ్యే స్పాట్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ సెల్ఫీ తీసుకుంటే.. ఇంకేమైనా కావాలా? అనే తరహా వ్యూ మీ కళ్లముందు ఉంటుంది. ఇది చూడకపోతే మీరు బ్రిడ్జిని మిస్ కాకపోవచ్చు.. కానీ ఆ ఫీలింగ్ ను మాత్రం తప్పకుండా మిస్ అవుతారు. అందుకే చెబుతున్నా బాస్.. కాస్త టైమ్ ఉందా? ఈ కేబుల్ బ్రిడ్జిపై జర్నీ ప్లాన్ చేసేయండి. ఇది ట్రిప్ కాదు.. జ్ఞాపకాల బ్రిడ్జిగా నిలవడం ఖాయం.

ఈ అద్భుతమైన కేబుల్ బ్రిడ్జి దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో, శివమొగ్గ జిల్లాలో ఉంది. ఇది షరావతి నదిపై, సాగర్ మరియు హోసనగర తాలూకాల మధ్య నిర్మించబడింది. ప్రదేశానికి దగ్గరగా పలు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సిగందూర్ చౌడేశ్వరి దేవాలయం, కొల్లూరు ముకాంబికా ఆలయం, అలాగే జోగ్ ఫాల్స్ వంటి నేచర్ స్పాట్లు కూడా ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను ఇస్తున్నాయి.

Related News

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Vande Bharat Trains: అందుబాటులోకి 20 కోచ్‌ ల వందేభారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు!

Railway tunnels: సొరంగాల్లో సైరన్ ప్రతిధ్వని.. నంద్యాల రైల్వే టన్నెల్స్ రహస్యాలు ఇవే!

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Railway Guidelines: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

Big Stories

×