Attack On Couples in Theatre: సినిమా థియేటర్లలో ప్రేక్షకులు మధ్య గొడవ, వాగ్వాదం చోటుచేసుకోవడం వంటి సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఓ హారర్ మూవీ థియేటర్లలో ఇలాంటి సంఘటనే చోటు చోచేసుకుంది. హాలీవుడ్ హారర్ మూవీ ది కంజురింగ్ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సిరీస్ ల నుంచి చివరి మూవీ ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites) ఇటీవల థియేటర్లకు వచ్చింది. అయితే ఈ హారర్ మూవీ చూసేందుకు థియేటర్ కు వెళ్లిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది.
ఈ సినిమా చూస్తూ రెండు జంటలు కొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడి కాస్తా చివరికి పోలీసు కేసు వరకు దారి తీసింది. ఈ ఘటనపై చించ్వాడ్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. చించ్వాడ్ లోని బిజ్లినగర్ కు చెందిన 29 ఏళ్ల టెక్కీ.. ది కంజురింగ్ మూవీ చూసేందుకు తన భార్యతో కలిసి వెళ్లాడు. అయితే ఇంటర్వేల్ వరకు సాఫీగానే సాగిన మూవీ ఇంటర్వేల్ తర్వాత వివాదంగా మారింది. సెకండాఫ్ హారర్ సీన్స్ వస్తుండగా.. ఓ వ్యక్తి టెక్కీ భార్య చెవులో గట్టిగా అరుస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. అదే విధంగా పలుమార్లు చేయడంతో పక్కనే ఉన్న టెక్కీకి కోపం వచ్చి అతడిపైకి లేచాడు. దీంతో నిందితుడు, అతని భార్య టెక్కీపై దాడికి తెగబడ్డాడు.
అతడిపై దుర్భాషలాడుతూ టెక్కీపై దాడి చేసి శారీరకంగా గాయపరిచారు. ఈ ఘటను ఆపేందుకు ప్రయత్నించిన టెక్కీ భార్యపై కూడా నిందితుడు, అతడి భార్య దాడి చేశారు. దీంతో వారు సమీపంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం దాడి చేసిన దంపతులపై టెక్కీ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం నిందితుల జంట కోసం వెతుకుతున్నారు. టెక్కీ ఫిర్యాదు ఆధారంగా, చించ్వాడ్ పోలీసులు వల్లభనగర్ దంపతులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 117 (స్వచ్ఛందంగా తీవ్రమైన గాయం కలిగించడం), 115 (గాయం కలిగించడం), 352 (శాంతికి భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంక వారిని అరెస్ట్ చేయలేదని, ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు.
Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వారిద్దరికే నెగిటివిటీ ఎక్కువ.. హౌజ్ వీడేది ఆమెనే!