Suryakumar Yadav : ఆసియా కప్ 2025 (Asia Cup 2025) మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య జరుగబోతుంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఇవాళ అన్ని జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. ఏ జట్టు ఎలా ఉంది..? ఏవిధంగా ఆడనున్నారు అనేది వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వాళ్లకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav) షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో సూర్య పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.
Also Read : Lalit Modi : ఇండియాను నిండా ముంచిన లలిత్ మోడీ అదిరిపోయే ప్లాన్.. ఫుట్ బాల్ వద్దు.. కబడ్డీ ముద్దు అంటూ
ముఖ్యంగా భారత్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ జరిపింది.పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారిగా పాకిస్తాన్ తో ఆసియా కప్ లో తలపడనుంది టీమిండియా. దీంతో ఈ మ్యాచ్ పై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తులు తమ ముఖాలను అద్దంలో ఎలా చూస్తారో తెలియదు. పాకిస్తాన్ వారు భారత్ కి చెందిన అమాయక ప్రజలను చంపుతారు. దుబాయ్ లో మళ్లీ వారితో భారతీయులు కరచలనం చేస్తున్నారని సూర్యకుమార్ యాదవ్ కి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు నెటిజన్లు. ఆసియా కప్ లో పాకిస్తాన్ ను తేలికగా తీసుకోబోమని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపారు. పాక్ తో సవాల్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని.. ఆ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషిస్తున్నట్టు చెప్పారు. తమ నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృస్టి పెడతామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్, బౌలింగ్ చేసేవిధంగా ఆల్ రౌండర్లను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు భారత్ – పాక్ మధ్య ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ చాలా రసవత్తరపోరు కొనసాగనుంది. టీమిండియా కి చెందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం కాగా.. పాకిస్తాన్ ఆటగాళ్లు బాబర్ ఆజం, రిజ్వాన్ లు దూరమయ్యారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ చేసి దూరం అయితే.. పాక్ ఆటగాళ్లను అస్సలు సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ప్రారంభించారు. 2016లో టీ-20 ఫార్మాట్ లో ఆడారు. 2015లో ఐసీసీ కొన్ని మార్పులు చేసింది. ఏంటంటే..? మార్పుల్లో భాగంగానే ఫార్మాట్ రొటేషన్ పద్దతిలో ఆడుతున్నారు. వచ్చే ఏడాది టీ-20 వరల్డ్ కప్ టీ-20లో జరుగడంతో ఆ ఏడాది ఆ ఫార్మాట్ లో జరిగింది. 2018లో వన్డే ఫార్మాట్ లో ఆసియా కప్ జరిగింది. 2019లో వన్డే వరల్డ్ కప్ జరిగింది. అలాగే 2025లో ఇప్పుడు ఏసియా కప్ టీ-20 ఫార్మాట్ లో జరుగుతుంది. 2026లో టీ-20 వరల్డ్ కప్ ఉండటంతో ఈ ఫార్మాట్ లో జరుగుతుంది. ఫార్మాట్ కి అనుగుణంగా ఆటగాళ్లు రాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టీ-20 ఫార్మాట్ లో టీమిండియా ఆటగాళ్లు ఎలా రాణిస్తారో వేచి చూడాలి మరీ.
Captain Suryakumar Yadav handshake with Pakistan's interior minister Mohsin Naqvi who recently given India a threat after Operation Sindoor.
I don't know how these people see their faces in mirror. They kill our innocent people & here we are handshaking with them. Shameful!! pic.twitter.com/QXZCHpMmcb
— Rajiv (@Rajiv1841) September 9, 2025