E-Paper
Advertisement

ఈ వీకెండ్ సినిమాల జాతర.. బరిలో ఉన్నవి ఇవే!

ఈ వీకెండ్ సినిమాల జాతర.. బరిలో ఉన్నవి ఇవే!
Advertisement

August Weekend Movies:ఈ వీకెండ్ మరోసారి మూవీ లవర్స్ కి మాంచి ఐ ఫీస్ట్ ఇచ్చేనందుకు రెడీ అయిపొయింది.అవును ఈ ..ఆగస్ట్ రెండో వారంలో ఏకంగా ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరి . ఇందులో నాలుగు తెలుగు సినిమాలు కాగా.. మూడు డబ్బింగ్ సినిమాలు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం హాలిడే కూడా ఉండటంతో ఈ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’

ఈ సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమిత బైజు నటించింది. రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. గత కొంతకాలంగా హిట్ కోసం చూస్తున్న సూర్యకు ‘కరుప్పు’ మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై కూడా ఫ్యాన్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు.

‘మకుటం’

Advertisement

ఇక హీరో విశాల్ నటించిన ‘మకుటం’ కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు విశాల్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా చేయడం విశేషం . అంజలి, దుషార విజయన్ ఇందులో నటించగా . సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇక విశాల్ తొలిసారి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

‘ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’

ఇక మరో డబ్బింగ్ సినిమా ‘ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’. ఇది అడ్వెంచర్ థ్రిల్లర్. అంతరిక్షంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఓ కుటుంబం అనుకోకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోతుంది. అక్కడ వారికి డైనోసార్లు ఎదురవుతాయి. వాటి నుంచి కుటుంబం ఎలా బయటపడింది అనేదే కథ. డైనోసార్ల కాన్సెప్ట్ ఉండటంతో ఈ సినిమాపై కూడా ఆసక్తి ఉంది.

‘అగధ’

Advertisement

ఇక తెలుగు సినిమాల్లో ‘అగధ’ కూడా ఈ వారమే వస్తోంది. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించారు. ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, శ్రవణ్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిస్టిక్ థ్రిల్లర్‌ జానర్ లో వస్తున్న ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

‘పళ్ళ బురుసు’

‘పళ్ళ బురుసు’ కూడా ఈ వీకెండ్‌లోనే విడుదలవుతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఉదయ్ చౌహాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘బలగం’లో మామా అల్లుళ్లుగా కనిపించిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో తండ్రీకొడుకులుగా నటించడం విశేషం . దీంతో ఈ సినిమాపై కూడా కొంత ఆసక్తి ఉందనే చెప్పాలి.

‘పాంచాలి పంచభర్తృక’

రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించిన ‘పాంచాలి పంచభర్తృక’ కూడా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. మరోవైపు ‘హుషారు పిట్టలు’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. బిక్షు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ALSO READ:9 సీజన్లు.. 9 కథలు.. బిగ్‌బాస్ విన్నర్స్ వీళ్లే!

మొత్తానికి ఈ వీకెండ్ ఏడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. ఆగస్ట్ 15 హాలిడే కలిసిరావడంతో సినిమాలకు మంచి అవకాశం ఉంది. అయితే చివరికి ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందో.. అదే బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది. ఈ ఏడు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో చూడాలి.

Tags

Related News

గంగా హాస్పిటల్ డాక్టర్స్ కు రామ్ చరణ్ కృతజ్ఞతలు..!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

ఫేక్ అకౌంట్..మోసపోవద్దు..ఫ్యాన్స్ కు దుల్కర్ రిక్వెస్ట్!

Big Stories

Advertisement
×