E-Paper
Advertisement

9 సీజన్లు.. 9 కథలు.. బిగ్‌బాస్ విన్నర్స్ వీళ్లే!

9 సీజన్లు.. 9 కథలు.. బిగ్‌బాస్ విన్నర్స్ వీళ్లే!
Advertisement

Bigg Boss Winners:బిగ్ బాస్ పదో సీజన్ మళ్లీ మొదలవుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి మరోసారి బిగ్ బాస్ జర్నీపై పడింది. అసలు ఈ షో ఎప్పుడు మొదలైంది, ఇప్పటిదాకా ఎన్ని సీజన్లు వచ్చాయి, ఎవరెవరు ఏ సీజన్‌లో విన్ అయ్యారు అంటూ గత హిస్టరీని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. మరి బిగ్ బాస్ యొక్క ఆ హిస్టరీ ఏంటో మనమూ ఒకసారి రివైండ్ చేసేద్దామా!

2017.. ఎన్టీఆర్‌తో మొదలైన బిగ్ బాస్ జర్నీ

బిగ్‌బాస్.. ఈ పేరు వినగానే హౌస్‌లో గొడవలు, టాస్కులు, లవ్ ట్రాక్స్, ఎమోషన్స్, ఎలిమినేషన్స్.. ఇలా చాలా విషయాలు గుర్తొస్తాయి. అలాంటి బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి 2017లో పరిచయమైంది. అప్పట్లో ఈ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు.

Advertisement

అప్పటికే ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌కు బిగ్‌బాస్ కాన్సెప్ట్ కూడా తోడవడంతో.. మొదటి సీజన్ నుంచే షోపై భారీ ఆసక్తి ఏర్పడింది.

మొదటి సీజన్‌లో మొత్తం కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్‌బాస్.. చివరికి శివ బాలాజీని విజేతగా నిలబెట్టింది. హౌస్‌లో తన గేమ్‌తో పాటు టాస్కుల్లో చూపించిన పట్టుదలనే శివ బాలాజీకి ప్రేక్షకుల సపోర్ట్ దక్కేలా చేసింది. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో తొలి విన్నర్‌గా ఆయన పేరు నిలిచిపోయింది.

2018.. కౌశల్ ఆర్మీతో మారిపోయిన సీన్

Advertisement

ఇక 2018లో రెండో సీజన్ వచ్చింది. ఈసారి హోస్ట్‌గా నాని వ్యవహరించారు. అయితే ఈ సీజన్‌లో అసలు హైలైట్‌గా నిలిచింది కౌశల్ మండా.మొదటి నుంచి చివరి వరకు తన గేమ్‌తో పాటు బయట వచ్చిన కౌశల్ ఆర్మీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో భారీగా ఓట్లు దక్కించుకున్నారు. చివరికి ట్రోఫీని అందుకుని సెకండ్ సీజన్ విన్నర్‌గా నిలిచారు.

2019.. నాగార్జున ఎంట్రీతో కొత్త క్రేజ్

2019లో మూడో సీజన్ వచ్చేసరికి బిగ్‌బాస్ తెలుగు అప్పటికే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు.

నాగార్జున హోస్టింగ్ కూడా షోకు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన గేమ్‌తో ప్రేక్షకులను మెప్పించి టైటిల్ గెలుచుకున్నారు. ఒక సింగర్‌గా గుర్తింపు ఉన్న రాహుల్.. బిగ్‌బాస్ తర్వాత మరింత పాపులర్ అయ్యారు.

2020.. కరోనా టైమ్‌లో అభిజీత్ హవా

2020లో వచ్చిన నాలుగో సీజన్ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. కరోనా సమయంలో బయట ప్రపంచం అంతా ఇళ్లకే పరిమితమైన సమయంలో.. బిగ్‌బాస్ కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందంటే అది మామూలు విషయం కాదు.

ఈ సీజన్‌లో అభిజీత్ విన్నర్‌గా నిలిచారు. ముఖ్యంగా ఆయన కూల్‌గా ఉండే విధానం, అవసరమైనప్పుడు మాత్రమే స్పందించే స్టైల్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అదే భారీ ఓట్లతో టైటిల్ అందుకోవడానికి కారణం అయింది.

2021.. సన్నీ కొట్టిన మాస్ విక్టరీ

ఇక 2021లో వచ్చిన ఐదో సీజన్‌లో వీజే సన్నీ విజేతగా నిలిచారు. యాంకర్‌గా, యాక్టర్‌గా పరిచయం ఉన్న సన్నీ.. బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం తన అసలు గేమ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండటం, తన టీమ్ కోసం నిలబడటం.. ఇలా సన్నీకి ప్లస్ అయ్యాయని చెప్పాలి.

2022.. రేవంత్‌దే టైటిల్

2022లో ఆరో సీజన్ వచ్చింది. ఈసారి సింగర్ ఎల్‌వీ రేవంత్ టైటిల్ దక్కించుకున్నారు.బయట ఇప్పటికే మంచి సింగర్‌గా పేరు ఉన్న రేవంత్.. హౌస్‌లో కూడా తనదైన స్టైల్లో గేమ్ ఆడారు. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అయినా.. చివరి వరకు పోరాడి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

2023.. కామన్ మ్యాన్‌గా ట్రోఫీ కొట్టిన పల్లవి ప్రశాంత్

ఇక 2023లో వచ్చిన ఏడో సీజన్‌లో మాత్రం ఓ కామన్ మ్యాన్ బిగ్‌బాస్ ట్రోఫీని గెలవడం పెద్ద హైలైట్‌గా మారింది.

పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డగా హౌస్‌లోకి వచ్చిన వ్యక్తి.. మొదట్లో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ రోజులు గడిచేకొద్దీ తన మాటతీరు, గేమ్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చివరికి సెలబ్రిటీలతో పోటీ పడి టైటిల్ గెలిచారు.

2024.. నిఖిల్ మలియక్కల్ గెలుపు

2024లో వచ్చిన ఎనిమిదో సీజన్‌లో నిఖిల్ మలియక్కల్ విన్నర్‌గా నిలిచారు.హౌస్‌లో మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించిన నిఖిల్.. టాస్కుల్లోనూ, స్ట్రాటజీలోనూ తన మార్క్ చూపించారు. చివరికి ఫైనల్‌లో విజయం సాధించి బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్నారు.

2025.. కళ్యాణ్ పడాల విజయం

ఇక 2025లో వచ్చిన తొమ్మిదో సీజన్‌లో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచారు. ఈ సీజన్‌తో బిగ్‌బాస్ తెలుగు జర్నీ తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది.

అలా చూస్తే.. 2017లో శివ బాలాజీతో మొదలైన తెలుగు బిగ్‌బాస్ విన్నర్స్ లిస్ట్.. 2018లో కౌశల్ మండా, 2019లో రాహుల్ సిప్లిగంజ్, 2020లో అభిజీత్, 2021లో సన్నీ, 2022లో రేవంత్, 2023లో పల్లవి ప్రశాంత్, 2024లో నిఖిల్, 2025లో కళ్యాణ్ పడాల వరకు వచ్చింది.

తొమ్మిది సీజన్లు.. ఒక్కో విన్నర్‌ది ఒక్కో స్టైల్!

అయితే ఈ తొమ్మిది సీజన్లలో ఒక విషయం మాత్రం కామన్. బిగ్‌బాస్‌లో ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నా.. చివరికి టైటిల్ కొట్టేది మాత్రం ప్రేక్షకుల మనసు గెలిచిన వ్యక్తే.కొంతమంది గేమ్‌తో గెలిస్తే.. మరికొంతమంది తమ వ్యక్తిత్వంతో గెలిచారు. ఇంకొందరు బయట ఉన్న ఫ్యాన్ బేస్‌తో ముందుకు వెళ్లారు.

also read :మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరిదో? తెరపైకి ముగ్గురు డైరెక్టర్లు!

మరి ఈసారి ఎవరు హౌస్‌లోకి వస్తారు? ఎవరు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారు? ఎవరు చివరి వరకు నిలబడి ట్రోఫీని ఎగరేసుకుపోతారు? అనేది బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలయ్యే వరకు సస్పెన్స్ అనే చెప్పాలి!

Tags

Related News

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. శుక్రవారం టీవీలల్లోకి హిట్ చిత్రాలు..

అనిల్ రావిపూడిలో ఈ క్రియేటివిటీ కూడా ఉందా? ఆ స్టార్ హీరోను భలే రీ క్రియేట్ చేశారే!

హోస్ట్ గా మారుతున్న మరో స్టార్ హీరో?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లోకి ఎంపికైన 15 మంది వీరే.. హౌస్ లోకి అడుగుపెట్టే ఆరుగురు ఎవరు?

అల్లు అర్జున్ మూవీలో సీరియల్ బ్యూటీకి ఛాన్స్.. ఇదిగో ప్రూఫ్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో రామరాజు షాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. ప్రేమను రెచ్చగొట్టిన వల్లి..

Gundeninda GudiGantalu Today episode: మరో బాంబ్ పేల్చిన రోహిణి.. ఒట్టు వేయించిన సుశీల.. మీనా పై ప్రశంసలు..

Big Stories

Advertisement
×