BigTV English

B.Saroja Devi: పద్మభూషణ్ గ్రహీత సరోజా దేవి నటించిన తెలుగు చిత్రాలివే!

B.Saroja Devi: పద్మభూషణ్ గ్రహీత సరోజా దేవి నటించిన తెలుగు చిత్రాలివే!

B.Saroja Devi:సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి . నిన్నటికి నిన్న లెజెండ్రీ నటులు కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడువగా.. నేడు మరో అలనాటి సీనియర్ హీరోయిన్ బి.సరోజా దేవి (బి.Saroja Devi) మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్య రీత్యా వచ్చే సమస్యలతోనే ఆమె బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఎన్టీఆర్ (NTR), ఎంజిఆర్(MGR ), ఏఎన్నార్ (ANR) లతో సినిమాలు చేసి అలరించారు. ఈ నేపథ్యంలోనే సరోజా దేవికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి తెలుగులో ఆమె నటించిన చిత్రాలు.


సరోజా దేవి నటించిన తెలుగు చిత్రాలు ఇవే..

1955లో హొన్నప్ప భాగవతార్ నిర్మించిన ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. దాదాపు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 180 కి పైగా చిత్రాలలో నటించింది. ఇక ఈమె నటించిన తెలుగు చిత్రాల విషయానికొస్తే.. 1957లో ‘పాండురంగ మహత్యం’ అనే సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఆ తర్వాత భూకైలాస్ (1958), పెళ్లి సందడి (1959), పెళ్ళికానుక (1960), 1961 లో సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, 1963 లో మంచి చెడు, శ్రీకృష్ణార్జునయుద్ధం, 1964లో దాగుడుమూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, 1965లో ప్రమీలార్జునీయం, 1966లో శకుంతల, 1967లో రహస్యం, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 26 తెలుగు చిత్రాలలో నటించారు. చివరిగా 1991లో వచ్చిన ‘అల్లుడు దిద్దిన కాపురం’ సినిమా తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటించలేదు. ఇక సినీ ఇండస్ట్రీకి చేసిన విశిష్ట సేవకు గానూ పద్మభూషణ్ అవార్డు వరించింది.


అయిష్టంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సరోజా దేవి..

13 ఏళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె 29 ఏళ్ల సినీ కెరియర్లో 180 కి పైగా సినిమాలలో నటించారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన సినీ జీవితకాలంలో ఒక్క గాసిప్ లేకుండా కెరియర్ మొత్తం గడవడం తన అదృష్టమని ఆమె గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడు ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదని.. ఒక కార్యక్రమంలో కన్నడ నిర్మాత హొన్నప్ప భాగవతార్ తనను చూసి కన్నడ సినిమాలో అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత తెలుగు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై సరోజాదేవి ఒక ఇంటర్వ్యూలో గతంలో మాట్లాడుతూ..” అమ్మ నాన్నల ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఆ తర్వాత నా భర్త శ్రీహర్ష కూడా పూర్తి సహకారం అందించారు. నిజానికి నాకు ఇండస్ట్రీలోకి రావాలన్న ఆసక్తి లేదు. వారి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఒక్క గాసిప్ కూడా లేకుండా జీవితం మొత్తం గడవడం నా అదృష్టం” అంటూ చెప్పారు.

సన్యాసిగా మారాలనుకున్న సరోజా దేవి..

ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు సన్యాసిగా మారాలని అనుకున్నారట. చిన్నప్పుడు సన్యాసులను చూసి పెద్దయ్యాక వారిలా మారాలని, పేదలకు సేవ చేయాలని అనుకున్నారట. కానీ సినిమాల పుణ్యమా అని మద్రాస్ కి రావడంతో.. ఇక్కడే వరుస సినిమాలలో చేసి తన జాతకాన్ని మార్చుకున్నాను అని తెలిపారు.

ALSO READ:Vikramarkudu Child Artist: దీనస్థితిలో విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్.. రాఘవ లారెన్స్ మాట నిలబెట్టుకుంటారా?

Related News

Sundarakanda Collections : సుందరకాండ మూవీకి 5.5 కోట్ల నష్టం… పాపం నారా రోహిత్ !

OG Movie : ఓజీకి జీరో బజ్.. పవన్ మళ్లీ వీరమల్లు గెటప్ వేయ్యాలేమో?

OG Movie: ఓజీ.. ఆ చిత్రాల కాపీనా.. హిట్ అవ్వాలంటే అద్భుతం జరగాల్సిందే ?

Samantha: అందులోనే నెగ్గాలని చూస్తున్న సామ్.. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?

Nandamuri Family: మళ్లీ మొదలైన వార్.. హరికృష్ణ జయంతితో బయటపడ్డ గొడవలు!

Tollywood: వెంకీ మూవీ కమెడియన్‌కు తీవ్ర అనారోగ్యం.. పరామర్శించిన మంచు హీరో!

Big Stories

×