BigTV English

Kavitha Vs Mallanna : కవితను పిచ్చి తిట్లు తిట్టిన మల్లన్న.. ఈసారి మరింత ఊర మాస్

Kavitha Vs Mallanna : కవితను పిచ్చి తిట్లు తిట్టిన మల్లన్న.. ఈసారి మరింత ఊర మాస్

Kavitha Vs Mallanna : సిగ్గుందా.. శరం ఉందా.. లజ్జ ఉందా..
కంచం-మంచం అంటే ఏంటో నీ అయ్యని అడుగు.. ఆయన రాసిండు..
మీ అయ్యని చెప్పు తీసుకొని కొట్టు.. అపుడు మీ నాయన కూడా ఒకటేస్తడు.. హౌల పోరీ.. అది తెలంగాణ భాష అని చెప్తడు..
ఏడ పన్నవ్ తల్లీ అప్పుడు..


ఇవీ తీన్మార్ మల్లన్న లేటెస్ట్ తిట్లు. మళ్లీ అదే భాష.. ఈసారి అంతకుమించి తిట్లు.. ఇంత గొడవ అవుతున్నా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అసలేమాత్రం తగ్గట్లే. మరింత రెచ్చిపోయారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎర్లీ మార్నింగ్ మరోసారి కవితపై తిట్ల దండకం అందుకున్నారు. ఆదివారం నాటి గొడవ, దాడితో పాటు కంచం, మంచం డైలాగ్‌పైనా మరింత చిచ్చు రాజేశారు. ఆ మాట తెలంగాణ వాడుకలో చాలా పాపులర్ అంటూ చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ రాసిన ఓ సామెతల పుస్తకంలో ఇదే డైలాగ్ ఉందంటూ స్క్రీన్ మీద ఆ బుక్‌లోని పేజీలను చూపిస్తూ.. చదివి వినిపించారు. ఆ సందర్భంగా సిగ్గు, శరం, లజ్జ.. నీ అయ్యని చెప్పుతో కొట్టు.. హౌల పోరీ, ఏడ పన్నవ్ తల్లీ.. అంటూ మరింతగా తిట్ల డోస్ పెంచారు తీన్మార్ మల్లన్న. లేటెస్ట్ ఎపిసోడ్‌తో కవితతో గొడవ మరింత పీక్స్‌కు చేరినట్టే కనిపిస్తోంది.

అదే భాష.. అవే తిట్లు..


మల్లన్న అంటే మాస్ జాతర అని అందరికీ తెలిసిందే. అయితే, కవిత విషయంలో ఆయన వాడిన భాషను మాత్రం ఎవరూ సమర్థించట్లేదు. పీసీసీ చీఫ్ సైతం తప్పుబట్టారు. ఆఫీసుపై అటాక్, మల్లన్నపై దాడి, గన్‌మెన్ ఫైరింగ్, పరస్పరం కంప్లైంట్స్.. ఇలా ఆదివారం అంతా రచ్చ రచ్చ జరిగింది. కట్ చేస్తే.. మండే మార్నింగ్ ఫ్రెష్‌గా మరోసారి అదే భాష.. అవే తిట్లతో మళ్లీ కవితపై విరుచుకుపడ్డారు మల్లన్న. అసలు ఎక్కడికి పోతోంది వివాదం?

ఎందుకీ ఓవరాక్షన్?

బీసీల క్రెడిబిలిటీ కోసం మల్లన్న ఆరాటం, కవిత పోరాటం ఇంత వరకూ వచ్చిందంటున్నారు. కులగణన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది రేవంత్ సర్కారు. మధ్యలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీల లొల్లి ఏందంటూ తెలంగాణ సమాజం అవాక్కవుతోంది. ఆయనేమో యూట్యూబ్ మాటున మాటల మంట రాజేస్తున్నారు. ఆవిడేమో ధర్నాలు, దాడులతో బీసీల అగ్గి ఎగదోస్తున్నారు. ఉనికి కోసం కాకపోతే ఏందీ ఓవరాక్షన్ అంటూ అంతా చీదరించుకుంటున్నారు.

Also Read : కవిత ఎపిసోడ్.. కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు మీటింగ్

ఎవరు రైట్? ఎవరు రాంగ్?

కంచం మచం అని అనటం తెలంగాణలో కామనే అయినా.. ఆ పద ప్రయోగం ఓ మహిళ విషయంలో ఎవరూ వాడరు. రాండంగ్‌గా అలా అంటారంతే. కానీ, మల్లన్న సూటిగా కవితనే టార్గెట్ చేస్తూ ఆ భాష వాడటమే ఇప్పుడింతటి కాంట్రవర్సీకి కారణం. ఆ విషయంలో అంత రచ్చ అయ్యాక కూడా.. మల్లన్న మళ్లీ అలాంటి తిట్లే తిట్టడం ఆయనకే చెల్లింది. దాడులు, కాల్పుల వరకూ వెళ్లినా తగ్గేదేలే అంటూ డోస్ పెంచడంతో ఈ ఇష్యూ ముందుముందు ఎక్కడిదాకా వెళ్తుందో అనే టెన్షన్ నెలకొంది. టోటల్ ఎపిసోడ్‌లో ఎవరిది తప్పు, ఎవరు ఒప్పు అనేది పక్కనపెడితే.. మహిళ విషయంలో వాడిన భాషపైనే అభ్యంతరాలన్నీ.

 

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×