E-Paper
Advertisement

గాయం తర్వాత బాలయ్య ఫుల్ స్వింగ్‌లోకి.. ‘దాదా’కు ఇక పరుగులే!

గాయం తర్వాత బాలయ్య ఫుల్ స్వింగ్‌లోకి.. ‘దాదా’కు ఇక పరుగులే!
Advertisement

Balakrishna Dada:సర్జరీ అయి కోలుకున్న బాలయ్య ఇపుడు వేగం పెంచినట్టే కనిపిస్తుంది.అవును… గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘దాదా’లో అప్పుడే అడుగుపెట్టాడట మరి. తాజాగా బాలయ్య అడుగెట్టడంతో సినిమా షూటింగ్ ఇపుడు మరింత వేగంగా జరుగుతుందని తెలుస్తుంది.

అసలే గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో బాలయ్య హీరోగా నటించిన ‘వీర సింహా రెడ్డి’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పక్కర్లేదు. దాంతో ఇపుడు వీరి కాంబినేషన్‌లో వస్తున్న ‘దాదా’ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి .

Advertisement

‘దాదా’ విషయంలో కూడా అదే ప్లాన్‌

వాస్తవానికి బాలయ్య సినిమాలకు ఉండే జెట్ స్పీడ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా కనిపిస్తుందని మొదట్లో అనుకున్నారంతా .మాములుగా ఒక సినిమాను ఎక్కువ కాలం సాగదీయకుండా తన పోర్షన్‌ను వేగంగా పూర్తి చేసే బాలకృష్ణ.. ‘దాదా’ విషయంలో కూడా అదే ప్లాన్‌తో ముందుకు వెళ్లినట్లు టాక్ వచ్చింది. అయితే మధ్యలో బాలయ్యకు గాయం కావడంతో షూటింగ్ షెడ్యూల్‌ మొత్తం మారిపోయింది.

Advertisement

బాలయ్య మళ్లీ షూటింగ్‌లోకి

దీంతో కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక సర్జరీ బారిన బాలయ్య పడటంతో ఆయన అభిమానులు బాలయ్య ఎప్పుడెప్పుడు కోలుకుని మళ్ళీ సెట్ పైకి వస్తాడా అని ఈగర్ గా ఎదురు చూశారు. మొత్తానికి కొన్ని వారాల విశ్రాంతి తర్వాత ఇప్పుడు బాలయ్య మళ్లీ షూటింగ్‌లోకి అడుగుపెట్టడం తో మురిసిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.

సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్

అయితే ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తున్నప్పటికీ మేకర్స్ పై క్లారిటీ రావాలి .ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్యకు సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే చెప్పాలి.బాలయ్య తన పోర్షన్‌ను పూర్తి చేశాడంటే తర్వాత మిగిలిన నటీనటులతో ఉన్న సీన్స్ అలాగే , ప్యాచ్ వర్క్ వంటివి పూర్తి చేసి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఆశ్చర్యం లేదు .

ఎలాంటి హంగామా చేస్తుందో!

ఇక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండటం తో మ్యూజిక్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.కారణం వీరి కాంబోలో వచ్చిన డాకు మహారాజ్ ,అఖండ సిరీస్ వంటివి ఎంత పెద్ద చార్ట్ బస్టర్స్ అయ్యయో తెలిసిందే . చూడాలి మరి బాలయ్య మాస్ ఇమేజ్‌కు గోపీచంద్ మలినేని టేకింగ్, థమన్ మ్యూజిక్ కలిస్తే ‘దాదా’ థియేటర్లలో ఎలాంటి హంగామా చేస్తుందో!

also read :చీరలో స్రవంతి చొక్కారపు.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!

Tags

Related News

చీరలో స్రవంతి చొక్కారపు.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!

పోస్టర్లు అదిరిపోయాయి.. సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి!

జానీ మాస్టర్ లవ్ స్టోరీ తెలుసా?..అసలు ట్విస్ట్ ఇదే!

రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!

చిట్టి ఈసారి ఏం చేస్తుందో..ఫరియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్!

చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నారట.. తమ్మారెడ్డి ఇచ్చిన లాజిక్ అదిరిపోయిందిగా!

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

Big Stories

Advertisement
×