Basit Ali On Babar Azam over Kohli vs Gill: టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య వన్డే సిరీస్ జరుగుతోన్న తరుణంలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభమాన్ గిల్ దుమ్ములేపుతున్నారు. కోహ్లీ ఇప్పటికే సెంచరీతో ఇరగదీయగా, రెండో వన్డేలో గిల్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే, ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడు అనే వాళ్లకు పాకిస్తాన్ మాజీ ప్లేయర్ బాసిత్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విరాట్ కోహ్లీతో బాబర్ ఆజంను అనవసరంగా పోల్చుతున్నాం..కానీ గిల్‌కు కూడా మనోడు సరిపోవడం లేదంటూ పరువు తీశారు. టీమిండియా కెప్టెన్ గిల్ లో 10 శాతం కూడా బాబర్ ఆజం ఆడటం లేదని హేళన చేశారు. కేవలం టెస్టులకు పరిమితమైన బాబర్ ఆజంను విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్ ప్లేయర్ తో ఎలా పోల్చుతారని ప్రశ్నించారు. ఇకపై విరాట్ కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చొదని కోరారు బాసిత్ అలీ. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆటగాడని బాసిత్ అలీ వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ లాంటి తోపు క్రికెటర్ రికార్డులను కూడా బద్దలు కొడుతున్నాడని స్పష్టం చేశారు. అతి త్వరలోనే సెంచరీల రికార్డు కూడా బ్రేక్ చేస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 86 సెంచరీలు నమోదు చేశాడని.. 2027 వన్డే వరల్డ్ కప్ లోపు 100 సెంచరీల మార్పు కూడా దాటేస్తాడని స్పష్టం చేశారు. అప్పుడు సచిన్ కంటే తోపు ప్లేయర్ గా కోహ్లీ మిగులుతాడని వివరించారు. అలాంటి గొప్ప క్రికెటర్ తో బాబర్ ను పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.
టీమిండియా కెప్టెన్ గిల్ విరాట్ కోహ్లీ తరహాలోనే అద్భుతంగా రాణిస్తున్నాడని ఈ ప్రశంసించారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ. మొన్న సెంచరీ చేసిన గిల్, లేటెస్ట్ గా డబ్బులు సెంచరీ నమోదు చేశాడని ప్రశంసించారు. చివరి మ్యాచ్ లో కూడా మళ్లీ డబుల్ సెంచరీ చేస్తాడని అంచనా వేశారు. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ రికార్డులను కూడా గిల్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉందన్నారు. అలాంటి వాడితో కూడా బాబర్ ను పోల్చలేమని పరువు తీశారు. 2024 కంటే ముందు బాబర్ నిజంగా అద్భుతమైన బ్యాటరే. ఆ సమయంలో ఫామ్ కోల్పోయిన బాబర్ ఇప్పటివరకు గాడిలో పడలేదని విమర్శలు చేశారు. ఎన్ని అవకాశాలు ఇచ్చిన అతడు వినియోగించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. ఇలాంటోడు బావిలో దూకిన తప్పు లేదన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా… ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావాలని ఆయన కోరారు. అలా అయితేనే ఇద్దరికీ గోల్డ్ మెడల్ వస్తుందని తెలిపారు. ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం టీమిండియా గెలుస్తుందని అంచనా వేశారు.