E-Paper
Advertisement

చీరలో స్రవంతి చొక్కారపు.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!

చీరలో స్రవంతి చొక్కారపు.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!
Advertisement

Sravanthi Chokkarapu:స్రవంతి చొక్కారపు..పరిచయం అవసరం లేని ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒక వైపు మూవీ ఈవెంట్స్ ,మరోవైపు సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఈ అమ్మడు నెట్టింట్లో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, పర్సనల్ విషయాలు అభిమానులతో పంచుకుంటుంది అన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఆమె పెట్టే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, క్యాప్షన్లకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.ఇక తాజాగా సెప్టెంబర్ నెలకు బాయ్ బాయ్ చెబుతూ ఆమె చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సెప్టెంబర్ నెల ముగిసిపోవడంతో తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్రవంతి.. “Septemberrrrrrrr..” అంటూ క్యాప్షన్ పెట్టింది.నిజానికి ఫోటో కి పెద్దగాఎలాంటి వివరణ ఇవ్వకపోయినా, ఆ ఒక్క క్యాప్షన్‌తోనే నెల మొత్తం తనకు ఎలా గడిచిందో చెప్పినట్టుగా అనిపించేలా ఈ పోస్ట్ ఉందనడంలో సందేహం లేదు. అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ కనిపించిన స్రవంతి.. చీరలో చాలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడం తో ఫిదా అయ్యారు ఫాలోవర్స్. బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్స్‌లో ఉన్న ప్రింటెడ్ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ తో ,సింపుల్ జ్యువెలరీతో నెటిజన్లని మెస్మరైజ్ చేసింది.

Advertisement

ఇక స్రవంతి షేర్ చేసిన ఈ ఫొటోలో ఆమె లుక్ మాత్రమే కాకుండా ఫొటో తీసుకున్న విధానం హైలెట్ అని చెప్పాలి.
.ఫోన్‌తో మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ ఎలాంటి ఓవర్‌ షో చేయకుండా చాలా నేచురల్‌గా కనిపించడం విశేషం.ఇక చేతికి గాజులు, బ్రేస్‌లెట్లు, మెడలో చిన్న ఆభరణాలు ధరించడంతో లుక్ కి మరింత ట్రెడిషనల్ టచ్ వచ్చేసింది.

అయితే ఈ పోస్ట్‌లో అసలు హైలైట్ మాత్రం “Septemberrrrrrrr..” అనే క్యాప్షన్‌ నే చెప్పాలి. మాములుగా ఒక నెల కంప్లీట్ అయితే సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఫొటోలు లేదా ఆ నెలలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను షేర్ చేస్తుంటారు. కానీ స్రవంతి మాత్రం సెప్టెంబర్ పేరును ఇలా స్ట్రెచ్ చేసి పెట్టడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

Advertisement

also read :పోస్టర్లు అదిరిపోయాయి.. సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి!

ఇక స్రవంతి చొక్కారపు విషయానికి వస్తే.. యాంకర్‌గా, సోషల్ మీడియా పర్సనాలిటీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఆమె.. సినిమా కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో తరచూ సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా టాలీవుడ్‌కు సంబంధించిన సినిమా ఈవెంట్లలో ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ భామే దర్శనమిస్తుంది. మొత్తానికి.. సెప్టెంబర్ నెలకు స్రవంతి ఇలా స్టైలిష్‌గా గుడ్‌బై చెప్పిందని చెప్పొచ్చు. అయితే “Septemberrrrrrrr..” అంటూ ఆమె పెట్టిన ఈ క్యాప్షన్‌లో ఉన్న అసలు సంగతి ఈ భామకే తెలియాలి !

Tags

Related News

గాయం తర్వాత బాలయ్య ఫుల్ స్వింగ్‌లోకి.. ‘దాదా’కు ఇక పరుగులే!

పోస్టర్లు అదిరిపోయాయి.. సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి!

జానీ మాస్టర్ లవ్ స్టోరీ తెలుసా?..అసలు ట్విస్ట్ ఇదే!

రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!

చిట్టి ఈసారి ఏం చేస్తుందో..ఫరియా పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో జోష్!

చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నారట.. తమ్మారెడ్డి ఇచ్చిన లాజిక్ అదిరిపోయిందిగా!

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే?

Big Stories

Advertisement
×