OTT Movie : ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. రేటింగ్ లో కూడా ఇలాంటి సిరీస్ లే ముందుంటున్నాయి. కాస్త బాగుందనిపించినా ఇక ఆ సిరీస్ ని వదలకుండా చివరి వరకు చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ 1990లలో బెంగాల్‌లోని ఒక చిన్న పట్టణంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ కామెడీతో పాటు ఉత్కంఠను పెంచే స్టోరీతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో కే కే మీనన్ అద్భుతమైన నటన, రణవీర్ షోరే సహాయక పాత్రతో ఈ సిరీస్ ఒక మరచిపోలేని థ్రిల్ ని ఇస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఏ ఓటీటీలో ఉందంటే
‘శేఖర్ హోమ్’ (Sekhar home)షెర్లాక్ హోమ్స్ కథల నుండి ప్రేరణ పొందిన ఒక హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రోహన్ సిప్పీ, సృజిత్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కే కే మీనన్, రణవీర్ షోరే, రసికా దుగల్, కీర్తి కుల్హారి, రుద్రనీల్ ఘోష్, షెర్నాజ్ పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2024 ఆగస్టు 14 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్‌లతో IMDbలో 7.9/10 రేటింగ్ సాధించింది.
కథలోకి వెళ్తే
1990లలో బెంగాల్‌లోని లోన్‌పూర్ అనే చిన్న పట్టణంలో శేఖర్ హోమ్ ఒక తెలివైన డిటెక్టివ్. తన మేధో శక్తితో కేసులను పరిష్కరిస్తుంటాడు. అతను జయవ్రత్ సైనీ అనే ఒక మాజీ ఆర్మీ డాక్టర్‌తో కలిసి ఒక ఇంట్లో రూమ్‌మేట్‌గా ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి బ్లాక్‌మెయిల్, హత్య, అతీంద్రియ సంఘటనలతో కూడిన వివిధ కేసులను పరిష్కరిస్తుంటారు. శేఖర్ లాండ్‌లేడీ మిసెస్ హెచ్, స్థానిక ఇన్‌స్పెక్టర్ గోవింద లహా కథలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. ఇరావతి అనే మహిళ శేఖర్‌పై ప్రేమతో ఉంటుంది. ముంతాజ్ అనే ఒక కీలక పాత్ర ఎంట్రీతో కథ మరో లెవెల్ కి వెళ్తుంది. మొదటి నాలుగు ఎపిసోడ్‌లు విభిన్న కేసులను పరిష్కరిస్తాయి. ఆతరువాత “M” అనే సీక్రెట్ విలన్ వెలుగులోకి వస్తాడు. ఐదవ ఎపిసోడ్ నుండి, శేఖర్ గతం కూడా బయటపడుతుంది. ఇక్కడి నుంచి స్టోరీ పూర్తిగా మారిపోతుంది.
Read Also : ఐదుగురు మనుషులతో 30 రోజులు అదే పని… బ్లడీ డెత్ గేమ్… థ్రిల్లింగ్ మలుపులు, ఊహించని సర్ప్రైజులు