BigTV English

Mass Jathara: ఆగస్టు నుంచి తప్పుకున్న మాస్ జాతర… విడుదల అప్పుడేనా?

Mass Jathara: ఆగస్టు నుంచి తప్పుకున్న మాస్ జాతర… విడుదల అప్పుడేనా?

Mass Jathara: సినీ నటుడు రవితేజ(Ravi Teja) హీరోగా భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మాస్ జాతర(Mass Jathara). సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్నారు. ఇటీవల సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు కూడా సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సినిమా పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


విడుదల వాయిదా పడిన మాస్ జాతర…

తాజాగా రవితేజ అభిమానులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఆగస్టు 27 తేదీ ఈ సినిమా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిందని సమాచారం. ఇంకా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు పూర్తి కాలేదని తెలుస్తుంది. ఇంకా రెండు పాటలు చిత్రీకరణ జరగాల్సి ఉందని, ప్రస్తుతం సినీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో షూటింగ్స్ కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే రెండు పాటలు ఇంకా పూర్తి కాలేదని అందుకే ఈ సినిమాని ముందుగా అనుకున్న విధంగా ఆగస్టు 27వ తేదీ విడుదల చేయలేరని ఇండస్ట్రీ సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు కానీ ఈ సినిమా మాత్రం విడుదల వాయిదా పడుతుందని వార్తలు వినపడుతున్నాయి.


అక్టోబర్లో విడుదల కాబోతోందా?

ఇలా ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్లో తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదల విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే తప్పనిసరిగా నిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీ లీల(Sreeleela) హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో రవితేజ మరోసారి పోలీస్ యూనిఫాంలో కనిపించబోతున్నారు. ఈసారి రైల్వే పోలీస్ ఆఫీసర్ గా రవితేజ సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేనా?

ఇదివరకు రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమాలన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అదే సెంటిమెంట్ మాస్ జాతర విషయంలో కూడా వర్క్ అవుట్ అవుతుందని, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీ లీల నటించడం విశేషం. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇటీవల కాలంలో రవితేజ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ధమాఖా తరువాత రవితేజకు ఆ స్థాయిలో సక్సెస్ రాలేదని చెప్పాలి. మాస్ జాతర సక్సెస్ రవితేజకు ఎంతో కీలకంగా మారింది.

Also Read: Anshu Reddy: బుల్లితెర నటి అన్షురెడ్డి నెల యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?

Related News

Deepika Padukone: ఇట్స్ రివేంజ్ టైమ్.. సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్!

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?

Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేస్… అసలేం జరిగిందంటే?

Drugs Case: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. ఏకంగా 35 కోట్ల విలువ.. ఎవరంటే?

Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బ్లాస్ట్, సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్  

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా

Naga Vasmsi: సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?

Big Stories

×