Jr NTR vs Balayya : గత కొంతకాలంగా బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్( Balakrishna Vs Jr.NTR) అంటూ అభిమానుల మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. నిజానికి బాబాయ్ – అబ్బాయ్ మధ్య ఏమీ లేకపోయినా వీరిద్దరూ కలసి కనిపించకపోవడంతోనే ఈ రూమర్లు మరింత బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ వచ్చినప్పుడు తీసివేయించడం పలు అనుమానాలకు దారితీసింది. “నిజానికి ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ప్రమోషన్స్ లో బాబాయ్ తో తనకు ఎలాంటి గొడవ లేదు అని.. బాబాయ్ తనకు తండ్రి లాంటి వాడు అని” జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినా.. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.
ఉపేంద్ర ఎంట్రీతో తప్పిన వార్..
దీనికి తోడు ఈసారి బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ అంటూ ఏకంగా తెరపై పోటీ ఉండనుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఉపేంద్ర (Upendra) కారణంగా ఆ పోటీ కాస్త క్యాన్సిల్ అయింది. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరి అసలు విషయం ఏమిటి? అసలు తెరపై వీరిద్దరి మధ్య వార్ ఏంటి? అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఉపేంద్ర రాకతో వీరిద్దరి మధ్య పోటీ లేకపోవడం ఏంటి? అంటూ ఇలా ఎవరికి వారు తమకు తోచిన ప్రశ్నలను కామెంట్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో? ఇప్పుడు చూద్దాం.
అబ్బాయ్ Vs బాబాయ్..
ఆగస్టు 14వ తేదీన ఎన్టీఆర్ విలన్ రోల్ పోషిస్తూ విడుదల చేసిన చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటించింది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా (Adithya chopra) నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి పోటీగా ఇదే రోజున లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా కూడా విడుదలయ్యింది. వాస్తవానికి ఆగస్టు 14వ తేదీన బాబాయ్ – అబ్బాయ్ మధ్య పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కారణం.. కూలీ సినిమాలో ఉపేంద్ర చేసిన పాత్ర మొదట బాలకృష్ణకే వచ్చింది. కానీ బాలకృష్ణ ఆ పాత్రను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత శాండిల్ వుడ్ నుండి ఒక స్టార్ ఉంటే బాగుంటుందని భావించిన డైరెక్టర్.. ఉపేంద్రను తీసుకున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర రెండు నిమిషాలు అయినా కొంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది..అలా ఈ పాత్రలో బాలకృష్ణ చేస్తారు అని వార్తలు బయటకు వచ్చినప్పుడు బాబాయ్ వర్సెస్ అబ్బాయి పోటీ తప్పదు అని అందరూ అనుకున్నారు. కానీ బాలయ్య అనూహ్యంగా ఆ పాత్ర నుండి తప్పుకోవడం.. ఉపేంద్ర రావడంతో ఈ వార్ కాస్త ముగిసిపోయిందని చెప్పవచ్చు.
అబ్బాయ్ Vs బాబాయ్ కాదు కూలీ Vs వార్ 2..
ఒకరకంగా చెప్పాలి అంటే.. ఒకవేళ బాలయ్య వెనక కూలీ సినిమాలో చేసి ఉండి ఉంటే.. ఈ ఆగస్టుకి వార్ 2 వర్సెస్ కూలీ కాదు.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ అనేలా పోటీ జరిగేది అని నెటిజన్స్ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఉపేంద్ర రాకతో ఈ వార్ కి ఆస్కారమే లేకుండా పోయిందని చెప్పవచ్చు.
ALSO READ: War-2 2day Collection : జోరుమీదున్న వార్ 2 కలెక్షన్స్… కూలీని కుదిపేస్తూ…