Jagan: వైసీపీకి సెకండ్ ఇయర్ కలిసిరావడం లేదా? పాలక పక్షం నుంచి ఇబ్బందులు పొంచి వున్నాయా? వచ్చే ఏడాది కూడా కంటిన్యూ అవుతాయా? జగన్ ట్వీట్ వెనుక అసలు మేటరేంటి? వైసీపీ చేసేది అంతా ధర్మంగా సాగుతుందని అంటున్నారా? అధికార పక్షం అధర్మంగా వెళ్తుందా? ఆయన మాటల వెనుక అర్థమేంటి?
కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘అధర్మం ఎంత బలంగా ఉన్నా- అది తాత్కాలికం.. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా- అది శాశ్వతం’ అని రాసుకొచ్చారు. ‘శ్రీకృష్ణుని జీవితం అందరుకు నిదర్శనం’ అని రాసుకొచ్చారు.
కృష్ణాష్టమి సందర్భంగా శాంతి, ప్రేమ, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. ఉన్నట్లు జగన్ మాటలకు అర్థం ఏంటంటూ ప్రత్యర్థుల నుంచి సెటైర్లు పడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఏమైనా పండగలు వస్తే క్రమం తప్పకుండా ఎక్స్‌లో రాసుకొస్తున్నారు.
అధికార పక్షాన్ని ఎండగడుతూనే.. తాను ధర్మంగా ఉంటానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.. చేశారు కూడా. పులివెందుల జెడ్పీ బైపోల్ ఫలితాలను దృష్టి పెట్టుకుని ఆ విధంగా కామెంట్స్ చేశారని అంటున్నారు. ఎందుకంటే పులివెందుల జెడ్పీ గెలుపు అధర్మంగా జరిగిందన్నది జగన్ మాట. టీడీపీ నేతలు చేసిన ఈ పని తాత్కాలికమేనని, ధర్మం నెమ్మదిగా ఉంటుందని అంటున్నారు.
ALSO READ: తిరుమల శ్రీవాణి టికెట్ల విక్రయాల్లో గందరగోళం.. భక్తులు నిరసనలు
ఈ లెక్కన పార్టీ పుంజుకునేందుకు జగన్ రకరకాల వ్యూహాలను అవలభిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది చివరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప జెడ్పీ, పులివెందుల మున్సిపాలిటీ చేజారకుండే ఉండేందుకు ప్లాన్ చేసినట్టు నేతల మాట.
నార్మల్‌గా ఓటమి.. విజయానికి తొలి మెట్టుగా చెబుతున్నారు. జగన్ కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నారా? అన్నది అసలు పాయింట్. మొత్తానికి జగన్ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్‌పై ఎవరికి నచ్చినట్టు వారు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు.
"అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం." ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 16, 2025