War-2 2day Collection :వార్ 2.. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకపోయినా విడుదల తర్వాత రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ హిట్ దిశగా దూసుకుపోతోంది వార్2 (War 2). హృతిక్ రోషన్(Hrithik Roshan)హీరోగా, కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ (NTR ) విలన్ గా నటించారు. ముఖ్యంగా తొలిసారి హిందీ రంగ ప్రవేశం చేస్తూ చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో రెండు వెర్షన్లలో రిలీజ్ అవ్వడంతో అటు నార్త్ ఆడియన్స్ ఇట్ సౌత్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది.
కలెక్షన్లలో కూలీని డామినేట్ చేస్తున్న వార్ 2..
ఇదిలా ఉండగా ఈ సినిమాకు పోటీగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా విడుదల అయింది. ఇది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ అంటూ ఐదు భాషలలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి వార్ 2 కి మించిన హైప్ ఉండేది. కానీ ఇప్పుడు కలెక్షన్లు మాత్రం తారుమారు అయినట్లు తెలుస్తోంది.
వార్ 2 రెండు రోజుల కలెక్షన్స్..
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే.. వార్ 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.56 కోట్లు వచ్చాయి. 2వ రోజు రూ.116 కోట్లు రావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే రెండవ రోజు ఒక్కటే ఈ సినిమాకు రూ.60 కోట్లు వచ్చాయి అంటే మొదటి రోజు కంటే రెండో రోజే కలెక్షన్లు ఎక్కువగా రావడం గమనార్హం. ముఖ్యంగా ఈ కలెక్షన్ జోరు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన కూలీ సినిమాను కూడా ఇప్పుడు వార్ 2 చిత్రం డామినేట్ చేస్తోంది.
కూలీ 2 రోజుల కలెక్షన్స్..
ఇక కూలీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు రూ.68 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇక రెండవ రోజు 116.50 కోట్లు వచ్చాయి. అంటే ఒక్క రెండో రోజు మాత్రమే రూ.48.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండవ రోజు కూలీకి కలెక్షన్లు బాగా తగ్గిపోయాయని చెప్పవచ్చు.
హైప్ ఉన్నా.. కలెక్షన్లపై భారీ దెబ్బ..
ఇకపోతే ఈ రెండు రోజుల కలెక్షన్లను బట్టి చూస్తే రిలీజ్ కి ముందు కూలీ సినిమాకి బజ్ ఎక్కువగా ఉండేది. కానీ రిలీజ్ తర్వాత కూలీ చిత్రాన్ని వార్ 2 సినిమా డామినేట్ చేస్తూ ఉండడం గమనార్హం. నిజానికి వార్ 2 సినిమా కేవలం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే విడుదలయ్యింది. అయితే కూలీ సినిమా మాత్రం ఏకంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అంటూ ఐదు భాషలలో రిలీజ్ అయింది. భారీ అంచనాలు భారీ తారాగణం భాగం కూలీ సినిమాలో భాగమయ్యారు. కానీ కూలీ సినిమా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే హైప్ ఎంత ఉన్నా సరే ప్రేక్షకులను కథ మెప్పించగలగాలి. అప్పుడే కలెక్షన్లు భారీగా వస్తాయి అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కూలీ చిత్రాన్ని వార్ 2 భారీగా డామినేట్ చేస్తోందని చెప్పవచ్చు.
ALSO READ:Bollywood Actor: 70 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు.. అవసరమా?