E-Paper
Advertisement

Akhanda 2 : మన దెబ్బ ఏంటో హిందీ వాళ్ళకి చూపించాం

Akhanda 2 : మన దెబ్బ ఏంటో హిందీ వాళ్ళకి చూపించాం
Advertisement

Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేశారు. మొదటి పాట ముంబై వేదికగా విడుదల చేశారు. రెండవ పాట వైజాగ్ లో ఈవెంట్ జరిపారు. ఈ పాట విడుదల చేస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు బాలయ్య.

అఖండ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దాంట్లో మురళీకృష్ణ అనే ఒక పాత్ర ఉంటుంది ఆ ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్ లో ఈ సందర్భంలో ఈ పాట పెట్టాము. సినిమాలో ఉండే ఏకైక మాస్ సాంగ్ ఇది మాత్రమే అంటూ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఈ సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడా స్టెప్స్ కంపోజ్ చేశాడు భాను.

మన దెబ్బేంటో చూపించు 

Advertisement

బాలకృష్ణ కొన్ని సందర్భాలలో స్టేజ్ పై మాట్లాడుతూ మాట జారడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. పలు సందర్భాలలో బాలకృష్ణ మాటజారారు. ఇక తాజాగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడుతూ ముంబైలో మొదటి సాంగ్ విడుదల చేశాము. వాళ్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన దెబ్బేంటో వాళ్లకి చూపించమంటూ బాలకృష్ణ మాట్లాడారు.

వైజాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మేము ఇక్కడ లెజెండ్ సినిమా షూటింగ్ చేశాము. గుర్రం మీద స్వారీ చేశాను చాలామంది ముందు అంటూ బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడిన ఆ మాటకు ఒక విషయం చెప్పాలి అంటూ బోయపాటి లెజెండ్ సినిమా షూటింగ్ విశేషాలను బయటపెట్టారు.

Advertisement

గుర్రం మీద స్వారీ చేయాలి అని చెప్పినప్పుడు, చేసేద్దాం దానిదేముంది అని బాలయ్య గారు అన్నారు. ఒక గాజు గ్లాస్ ను గుదవలసి ఉంటుంది దానికోసం ఒక డూప్లికేట్ చేద్దాం అని అనుకున్నాము. డూప్లికేట్ అవసరం లేదు అని ఒరిజినల్ దాంతోని చేశారు. ఆ గుర్రం గంటకి 110 కిలోమీటర్లు వెళ్తుంది అంటూ బోయపాటి శ్రీను బాలయ్యకు ఎలివేషన్ ఇచ్చారు.

మంచి అంచనాలు 

మొత్తానికి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో అని క్యూరియాసిటీ చాలామందికి ఉంది.

Also Read: Varanasi: మీ క్రియేటివిటీ తగలెయ్య, ఏకంగా ఎద్దుతో ఇంటర్వ్యూ ప్లానింగ్

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×