E-Paper
Advertisement

కారు కలర్ కూడా పెట్రోల్ ఖర్చు పెంచుతుందా? వామ్మో.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!

కారు కలర్ కూడా పెట్రోల్ ఖర్చు పెంచుతుందా? వామ్మో.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!
Advertisement

Black vs White Cars: కారు కొనాలనుకునేవారు ఎక్కువగా మైలేజ్, ఫీచర్లు, ధరల గురించి ఆలోచిస్తారు. కానీ, కారు రంగు కూడా ఇంధన వినియోగం మీద ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నలుపు, ముదురు నీలం, డార్క్ గ్రే లాంటి ముదురు రంగు కార్లు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీంతో వాహనం లోపలి వేడి పెరిగి, ఎయిర్ కండిషనర్ ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. ఫలితంగా ఇంధన వినియోగం కూడా కొంత మేర పెరుగుతుంది.

డార్క్ కలర్ కార్లలో ఎక్కువ వేడి! 

ఒకే ప్రదేశంలో ఎండలో పార్క్ చేసిన రెండు కార్లలో తెలుపు రంగు కారుతో పోలిస్తే నల్ల రంగు కారు క్యాబిన్ ఉష్ణోగ్రత 5 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం, ముదురు రంగులు సూర్యరశ్మిని ఎక్కువగా తీసుకుంటాయి. వేడి ఎక్కువగా స్టోర్ కావడం వల్ల కారు లోపలి భాగం త్వరగా వేడెక్కుతుంది. అయితే, దీనికి భిన్నంగా వైట్, సిల్వర్ లాంటి లైట్ కలర్స్ సూర్యరశ్మిని ఎక్కువగా తీసుకోవు. వేడిని బయటకు రిఫ్లెక్ట్ చేస్తాయి. తెలుపు రంగు వాహనాలు సూర్యకాంతిలోని దాదాపు 60 శాతం వరకు కాంతిని తిరిగి వెనక్కి పంపిస్తాయి. దీంతో కారు లోపల వేడి తక్కువగా చేరుతుంది. ప్రయాణ సమయంలో క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది.

ముదురు రంగు కార్లలో ఏసీ వినియోగం ఎక్కువ!

Advertisement

ముదురు రంగు కార్లలో క్యాబిన్ ఎక్కువ వేడిగా ఉండటంతో డ్రైవర్లు సాధారణంగా ఏసీని ఎక్కువసేపు ఉపయోగిస్తారు. ఎయిర్ కండిషనర్ పని చేయడానికి ఇంజిన్ అదనపు శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కార్లలో   ఇంధన వినియోగంపై నేరుగా ప్రభావం చూపుతుంది. వేసవి కాలంలో ఏసీని ఎక్కువ ఉపయోగించడం వల్ల కారు మొత్తం ఇంధన సామర్థ్యం 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఇందులో కారు రంగు వల్ల వచ్చే ప్రభావం తక్కువగానే ఉంటుంది. ముదురు రంగు కార్లలో లేత రంగు కార్లతో పోలిస్తే సుమారు 2 శాతం వరకు అదనపు ఇంధనం ఖర్చయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ తేడా చిన్నదిగా కనిపించినప్పటికీ, ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ ప్రభావం నెలవారీ ఖర్చులో కనిపించవచ్చు.  వేసవి నెలల్లో ఎక్కువగా కారు ఉపయోగించే వారు వైట్ సిల్వర్ రంగు వాహనాలను ఎంచుకుంటే నెలకు రూ.200 వరకు ఇంధన వ్యయంలో ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లేత రంగు కార్లు పర్యావరణానికి కూడా కొంత మేలు చేస్తాయి. ఎందుకంటే ఏసీ తక్కువగా పనిచేయడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కార్బన్ ఉద్గారాలు కూడా కొంత మేర తగ్గుతాయి. ఎక్కువగా ఎండ ప్రాంతాల్లో ప్రయాణిస్తుంటే, ఇంధన ఖర్చును కొంత మేర తగ్గించుకోవాలనుకుంటే, లైట్ కలర్ కార్లను తీసుకోవడం మంచిది.

Advertisement

Read Also: ఫాస్ట్ ఛార్జింగ్ vs స్లో ఛార్జింగ్.. EV బ్యాటరీకి ఏది బెస్ట్?

Related News

ఏథర్ సూపర్ సర్‌ ప్రైజ్.. కొత్త EL స్కూటర్‌ లాంచ్ డేట్ ఫిక్స్!

MG విండ్సర్‌ ఔట్.. ఇండియన్ EV మార్కెట్‌ లో కొత్త చాంపియన్!

జూలైలో మారుతి సుజుకికి బంపర్ సేల్స్.. వారెవ్వా.. ఒక్క నెలలో అన్ని లక్షల కార్లు అమ్మిందా?

హోండా నుంచి 3 కొత్త కార్లు.. ఏ మోడళ్లు వస్తున్నాయో తెలుసా?

జూలైలో టాటా అమ్మకాల జోరు.. వామ్మో.. ఒక్క నెలలో అన్ని కార్లు అమ్మిందా?

2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!

విడా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఔనా.. నిజమా? EV కారుగా అంబాసిడర్ రీఎంట్రీ?

Big Stories

Advertisement
×