E-Paper

జూబ్లీహిల్స్ ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టుకు బండ్ల గణేశ్! కోర్టు డ్రామా వెనుక అసలు కథ ఇదే..

జూబ్లీహిల్స్ ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టుకు బండ్ల గణేశ్! కోర్టు డ్రామా వెనుక అసలు కథ ఇదే..
Advertisement

Bandla Case: బండ్ల గణేశ్…పరిచయం అక్కర్లేని పేరిది.జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టి ,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకొని తక్కువ సమయంలోనే సాలిడ్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటాడు  .గబ్బర్ సింగ్, బాద్‌షా, టెంపర్ ఆయన ప్రొడక్షన్ లో వచ్చినవే.ఇక బండ్ల గణేశ్ స్టేజ్ పైకి ఎక్కితే ఇచ్చే స్పీచ్ లకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా. అయితే తాజాగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ చుట్టూ ఒక కాంట్రవర్సీ కమ్మేసింది.

తక్కువ ధరకు బ్యాంకు అధికారులు వేలం వేశారంటూ

Advertisement

అవును …తన ఫ్యామిలీకి చెందిన విలువైన ఆస్తిని నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత తక్కువ ధరకు బ్యాంకు అధికారులు వేలం వేశారంటూ బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆస్తి వేలం వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బ్యాంకింగ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఈ కేసుకి సంబంధించిన విషయంలోకి వెళ్తే గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో లోన్ తీసుకున్నాడు బండ్ల గణేష్.అయితే అది చెల్లించకపోవడంతో వసూళ్ళలో భాగంగా ఈ సమస్య మొదలైంది. లోన్ రికవరీ కోసం జూబ్లీహిల్స్‌లోని బండ్ల గణేష్ స్థిరాస్తిని బహిరంగ వేలం ద్వారా అమ్మారు బ్యాంక్ అధికారులు. అయితే మార్కెట్ రేటు కన్నా చాల తక్కువ ధరకి తన ఇంటిని అమ్మారని, దీంతో బ్యాంకు అధికారులు కూడబలుక్కుని లోపాయి కారి ఒప్పందంతో ఇలా చేశారనన్నది బండ్ల గణేష్ చేస్తున్న ఆరోపణ.

Advertisement

2022లోనే న్యాయపోరాటానికి దిగిన బండ్ల

అయితే ఈ వేలాన్ని సవాల్ చేస్తూ ఆయన 2022లోనే న్యాయపోరాటానికి దిగాడు బండ్ల.. అప్పట్లో కింది కోర్టు అయిన డెట్ రికవరీ ట్రైబ్యునల్ (DRT)లో బండ్ల గణేశ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది కూడా. ఆ వేలం పాట చెల్లదని, దాన్ని రద్దు చేసి వేలం ద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఆస్తి యజమానులకే ఇచ్చేయాలని ట్రైబ్యునల్ బ్యాంకును ఆదేశించింది.

దీంతో ట్రైబ్యునల్ ఇచ్చిన ఈ షాకింగ్ తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళింది యూనియన్ బ్యాంక్. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు తాజాగా డీఆర్‌టీ ఇచ్చిన పాత ఉత్తర్వులను కొట్టేస్తూ సంచలన తీర్పునిచ్చింది. బ్యాంక్ జరిపిన ఆస్తి వేలం పూర్తిగా లీగల్ గానే ఉందంటూ జడ్జ్మెంట్ ఇచ్చింది.దీంతో డిసప్పాయింట్ అయిన బండ్ల హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ పై రియాక్ట్ అవుతూ తన ఎక్స్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ వదిలాడు.

also read:బుల్లితెరపై ‘పెద్ది’ జాతర.. నెట్‌ఫ్లిక్స్ డేట్ ఫిక్స్.. ఇక డిజిటల్ స్క్రీన్స్ షేక్ అవ్వాల్సిందే!

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి వివరిస్తూ, తన హక్కుల కోసం ఎంతవరకు అయినా పోరాడుతానని ప్రకటించాడు బండ్ల.ఈ వ్యవహారంలో న్యాయం కోసం సుప్రీంకోర్టుకి త్వరలోనే వెళ్తానని స్పష్టం చేశాడు.మరి భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని చెబుతున్న బండ్ల ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో చూడాలి.

Related News

నాని ఫ్యాన్స్‌కు షాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ సినిమా పెండింగ్? లైన్‌లోకి కోలీవుడ్ సెన్సేషన్!

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి సెన్సార్ షాక్.. ఆ సీన్స్ తీసేస్తేనే రిలీజ్!

ఆ సంఘటన నన్ను మార్చేసింది.. విలన్ పాత్రల ప్రభావంపై బాలాజీ ఊహించని కామెంట్స్!

చిత్ర యూనిట్ కి షాక్.. దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీ స్టోరీ లీక్!

బుల్లితెరపై ‘పెద్ది’ జాతర.. నెట్‌ఫ్లిక్స్ డేట్ ఫిక్స్.. ఇక డిజిటల్ స్క్రీన్స్ షేక్ అవ్వాల్సిందే!

లవ్ రూమర్స్.. కాబోయే వాడికి అలాంటి క్వాలిటీస్ ఉండాలంటున్న శ్రీ లీల!

సమంత కొత్త అవతారం.. ప్రెగ్నెన్సీలో కూడా డోంట్ కేర్!

Big Stories

×