E-Paper
Advertisement

పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. రాత్రంతా నిద్రపట్టలేదంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్!

పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. రాత్రంతా నిద్రపట్టలేదంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Bandla Ganesh: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం నాడు తన భార్య అన్నా లెజినోవాతో కలసి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో కనిపించడంతో ఆయనపై సోషల్ మీడియా అటెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయింది..అసలు పవన్ కళ్యాణ్ కు ఏం జరిగింది? ఎందుకు ఆయన హాస్పిటల్ లో ఉన్నారు? అంటూ పలు రకాల ప్రశ్నలను సోషల్ మీడియా ద్వారా లేవనెత్తారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజాల కండరాల నొప్పి, రొటేటర్ కఫ్ తో బాధపడుతున్నారట. ఈ సమస్యకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి వెళ్ళగా.. ఆయన భుజాలను నిషితంగా పరిశీలించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని సూచించారట.

బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్..

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ త్వరగా శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ భక్తుడిగా, అటు నిర్మాతగా, నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ఈ గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గాయాలు ఇప్పటివి కావు.. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో తగిలినవి. ఈ విషయం తెలియగానే నాకు నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు అని చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

Advertisement

also read:ప్రేమలో పడ్డ నిహారిక.. బుగ్గలు కొ*రి*కేస్తూ మరీ రొమాంటిక్ ఫోజులు!

రాత్రంతా నిద్ర పట్టలేదు..

బండ్ల గణేష్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా.. “నిన్న రాత్రంతా నాకు నిద్ర రాలేదు.. ఒకటే ఆలోచన.. ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. దాదాపు 15 సంవత్సరాలుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరువెక్కి పోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకొని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళముందే కనిపిస్తున్నాయి. గుజరాత్ లో జరిగిన ఆ ప్రమాదం.. గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం.. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం.. ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి.

మహా మనిషి తీసుకున్న నిర్ణయం..

Advertisement

ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు.అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు.. మాటకు ప్రాణం ఇచ్చే మహా మనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం.. నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదు.. ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు అని , మీ శరీరం మీకు సహకరించకపోయినా ఈ నిర్ణయం తీసుకున్నారు” అంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పంచుకున్న ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై ఆయనకున్న ప్రేమను మరొకసారి నిరూపించింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

Big Stories

Advertisement
×