E-Paper
Advertisement

43 డిగ్రీల ఉష్ణోగ్రతను యూరప్‌ ఎందుకు తట్టుకోలేక పోతుంది? ఇండియాకి, ఆ దేశాలకు ఉన్న తేడా ఇదే!

43 డిగ్రీల ఉష్ణోగ్రతను యూరప్‌ ఎందుకు తట్టుకోలేక పోతుంది? ఇండియాకి, ఆ దేశాలకు ఉన్న తేడా ఇదే!
Advertisement

Europe Vs India: యూరప్‌ అంతటా ఎండలు మండిపోతున్నాయి. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల వేడిమి తట్టుకోలేక జూన్ 21నుండి ఇప్పటివరకు దాదాపు 1300 మందికి పైగా మరణించారు. కేవలం 43 డిగ్రీలకే యూరప్ ఎందుకంత భగభగమంటోంది? ఇండియాతో పోల్చితే అక్కడ ఎందుకంత వేడి? నిపుణులు ఏం చెబుతున్నారు. ఈ విషయాలపై ఓ లుక్కేద్దాం.

యూరప్ వర్సెస్ ఇండియా.. 43 డిగ్రీల ఉష్ణోగ్రతను ఎందుకు తట్టుకోలేకపోతోంది?

Advertisement

ఐరోపా ఎండలు మండిపోతున్నాయి. వాటిని తట్టుకోలేక ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నాయి. చల్లటి ప్రాంతంలో సేద తీరేందుకు తహతహలాడుతున్నారు. తీవ్రమైన వేడి గాలుల నేపథ్యంలో ఐరోపా-భారత్ మధ్య 43 డిగ్రీల ఉష్ణోగ్రతలను పోలుస్తూ ఓ నెటిజన్స్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

ఇండియాలో సమ్మర్ వేళ ఉష్ణోగ్రతలు 45 నుండి 48 డిగ్రీల వరకు నమోదు అయ్యిందని, యూరప్‌లో కేవలం 43 డిగ్రీలకే ఎందుకు అల్లాడిపోతున్నారని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. దీనిపై మరొక నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. యూరప్ అనేది ఇండియా కంటే ఉత్తర ప్రాంతంలో ఉంటుందని ప్రస్తావించాడు. భారత్‌లో సూర్యుడు నిట్ట నిలువుగా పడతాయి. ఐరోపాలో సూర్యుని కాంతి ఒక కోణంలో భూమిపై పడుతుందని రాసుకొచ్చాడు.

Advertisement

ఇండియాకి, ఆ దేశాలకు ఉన్న తేడా ఇదే!

వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండటంతో రోజంతా బలమైన వేడి గాలులు ఏర్పడతాయని, సూర్యరశ్మి భిన్నంగా ఉంటుందని రాసుకొచ్చాడు. భారత్‌లో వాయు కాలుష్యం సూర్యరశ్మిని మసక బారినట్టు కనిపిస్తుంది. యూరప్‌లో ఆకాశం నిర్మలంగా ఉండటంతో సూర్యరశ్మి ప్రకాశవంతంగా అనిపిస్తుందని రాసుకొచ్చాడు. భారత్‌లో కాలుష్యం వేడిని విభిన్నంగా చెదరగొడుతుందన్నాడు.

ఇటీవలి యూరప్‌లో వడగాలులతోపాటు సాధారణ గాలులు పెద్దగా లేవు. చెట్ల ఆకుల్లో కదలిక జాడ కనిపించలేదు. అందుకే అక్కడ వేడి వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారతదేశంలో వేడి గాలులు, తేమ ప్రభావాలను చూపవచ్చని ప్రస్తావించాడు. యూరప్‌లో భవనాలు ఎండ వేడిమిని తట్టుకునే విధంగా కాకుండా శీతాకాలం కోసం డిజైన్ చేసినట్లు తెలిపాడు.

ALSO READ: అమెరికా-ఇరాన్ ‘దోహా’ దౌత్యం.. ట్రంప్ అవునంటున్నారు.. ఇరాన్ కాదంటోంది.. అసలేం జరుగుతోంది?

ఇంటి లోపల వేడిగా ఉండేలా చెక్క నేలలు, ముదురు రంగు పైకప్పులు ఉంటాయి. ఇండియాలో ఇళ్లలో టైల్స్ వేసిన నేలలు ఉంటాయని, అందువల్ల ఇంటి లోపల వాతావరణం చల్లగా ఉంటుందన్నాడు. ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో వెచ్చని రోజులు చాలా తక్కువగా ఉంటాయని, అక్కడ ఏసీల వాడకం సాధారణం కాదన్నాడు.  ఏడాదిలో 7 రోజుల కంటే తక్కువ కాలం ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటుతాయని ప్రస్తావించాడు.

అసలు వాస్తవం ఏమిటంటే.. వేడిగాలుల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఐరోపాలో ఏసీల వాడకం సర్వసాధారణం కానున్నాయి. ఇప్పటికే చాలా కార్యాలయాలు, షాపింగ్ కేంద్రాలలో ఏసీలు ఉన్నాయి, ఇళ్లలో కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది.

Related News

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

Big Stories

Advertisement
×