BigTV English

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Kishkindhapuri : ఒక్కొక్కరు ఒక జోనర్ సినిమాలోని ఇష్టపడుతూ ఉంటారు. అలానే హర్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగులో హర్రర్ సినిమాలు అంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బూత్, రాత్రి వంటి సినిమాలు గుర్తొస్తాయి. రీసెంట్ టైమ్స్ లో అయితే మసుద సినిమా మంచి హై ఇచ్చింది అని చెప్పాలి. ఎక్కువగా తమిళ దర్శకులు తెరకెక్కించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయినప్పుడు అవి ఎక్కువ భయాన్ని క్రియేట్ చేయగలిగాయి.


విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13b. అలానే రజినీకాంత్ నటించిన చంద్రముఖి, రాఘవ లారెన్స్ కాంచన, నయనతార మయూరి. ఇలాంటి సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ఇచ్చాయి. హిందీలో వచ్చిన తుంబాడ్ సినిమా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కౌశిక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమా కిష్కిందపురి. ఈ సినిమా ఒక హర్రర్ జోనర్ లో వస్తుంది అని చెప్పారు.

ఎక్కడ భయపడాలి.?

ఈరోజు తెలుగు ప్రేక్షకుడు మొత్తం ప్రపంచ సినిమాను కూడా చూస్తున్నాడు. ఓటిటి ఓపెన్ చేస్తే ఏ జోనర్ సినిమా కావాలి అంటే ఆ జోనర్ లో సినిమా అవైలబుల్ గా ఉంటుంది. అలానే హర్రర్ సినిమాలను వెతుక్కుని మరీ చూసే ఆడియన్స్ ఉన్నారు. ఈ తరుణంలో కిస్కిందపురి అనే సినిమా హారర్ జోనర్ లో వస్తుంది అని చిత్ర యూనిట్ అంతా చెప్పారు. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. ట్రైలర్ చూడటానికి వాస్తవానికి బానే ఉంది. కానీ హర్రర్ సినిమా అనే ఫీల్ మాత్రం ఎక్కడా కలగలేదు. కొందరు సోషల్ మీడియాలో సినిమాను ట్రోల్ చేస్తున్నారు. హర్రర్ సినిమా అన్నారు కదా ఎక్కడ భయపడలో కూడా చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


సెప్టెంబర్ 12న తెలుస్తుంది 

ఈ సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. అదే రోజున తేజ నటిస్తున్న మిరాయి సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ అన్ని కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చాలామందిని ఆశ్చర్యపరిచింది మిరాయి సినిమాలోని విఎఫ్ఎక్స్. సీజీ వర్క్ మాత్రం మిరాయి సినిమాకి సంబంధించి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇప్పటికే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఆ సినిమా విషయంలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఆ సినిమా టేబుల్ ప్రాఫిట్ అని నిర్మాత విశ్వప్రసాద్ కొన్ని ఇంటర్వ్యూస్ బహిరంగంగానే చెప్పారు. ఇక సినిమా రిజల్ట్ ని బట్టి వచ్చే కలెక్షన్స్ బోనస్ అని చెప్పొచ్చు.

Also Read: Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×