Anushka Shetty : చాలామంది హీరోలకు అభిమానులు ఉన్నట్లే హీరోయిన్స్ కు కూడా సపరేట్ గా అభిమానులు ఉంటారు. అలా అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. ప్రస్తుతం అందరూ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు కానీ. ఒకప్పుడు అనుష్క చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా మంచి ప్రాధాన్యత ఉండేది.
అనుష్క ఎన్ని సినిమాలు చేసినా కూడా అరుంధతి (Arundhati) సినిమాలో తన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అక్కడితోనే అనుష్క స్టార్డం విపరీతంగా పెరిగిపోయింది. అనుష్క చేసిన కొన్ని క్యారెక్టర్స్ తనకు విపరీతమైన పేరును తీసుకొచ్చాయి. వేదం సినిమాలో సరోజ, రుద్రమదేవి (rudramadevi) , భాగమతి (bhaagamathie) , బాహుబలి (Baahubali) వంటి ఎన్నో సినిమాల్లో అనుష్క తన ప్రతిభను చూపించారు. ఇక ప్రస్తుతం ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుష్క. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది.
నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా చేసిన మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty) సినిమా తర్వాత ఇప్పటివరకు అనుష్క ఏ సినిమాలో కనిపించలేదు. 2023లో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత బయట కూడా పెద్దగా అనుష్క కనిపించలేదు. ఇప్పుడు ఘాటీ సినిమా ప్రమోషన్స్ లో కూడా అనుష్క కనబడటం లేదు. కేవలం ఫోన్ కాల్ తో మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇక అనుష్క అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ముందు ముందు చాలా రాబోతున్నాయి. రానా (Rana Daggupati) తో ఫోన్ కాల్ లో కూడా ఈ విషయాలను బయట పెట్టింది అనుష్క. అనుష్క రెండు సినిమాలు చేస్తుంది. మలయాళంలో ఒక సినిమా రాబోతుంది. అనుష్క తెలుగులో చేయబోయే ఒక సినిమాని త్వరలో నిర్మాతలు అనౌన్స్ చేయనున్నారు.
కొన్ని సినిమాల కోసం చాలా డెడికేటెడ్ గా అనుష్క వర్క్ చేశారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన సైజు జీరో అనే సినిమా కోసం విపరీతంగా లావు అయిపోయారు అనుష్క. ఆ తర్వాత తగ్గడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి కొంతమేరకు తగ్గారు. ఇప్పుడు కూడా బాహుబలి డాక్యుమెంటరీలో కనిపించనున్నారు. మొత్తానికి అనుష్క సెట్ చేసిన ప్రాజెక్టు చూస్తుంటే అభిమానులకు ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఘాటి సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో సెప్టెంబర్ 5న తెలుస్తుంది
Also Read: Anushka Shetty : ఇంతకుముందు ఎప్పుడూ అలా చేయలేదు, అసలు విషయం బయట పెట్టేసింది