E-Paper
Advertisement

ఫోన్ బ్యాటరీ 20% కన్నా తగ్గగానే..ఎందుకు వేగంగా డ్రైన్ అవుతుంది? అసలు కారణమిదే!

ఫోన్ బ్యాటరీ 20% కన్నా తగ్గగానే..ఎందుకు వేగంగా డ్రైన్ అవుతుంది? అసలు కారణమిదే!
Advertisement

Smartphone battery saving tips: స్మార్ట్‌ ఫోన్ వాడేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? బ్యాటరీ 100 నుంచి 50 శాతానికి రావడానికి చాలా సమయం పడుతుంది..20 శాతానికి పడిపోయిన తర్వాత..మాత్రం రెప్పపాటులో.. అయిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? చాలా మంది.. దీని గురించి ఆలోచించి అయోమయానికి గురవుతుంటారు. ఇది ఏవైనా ఫోన్ సమస్యనా.. లేక దీని వెనక వేరే కారణం ఉందా? లిథియం-అయాన్ బ్యాటరీల పని తీరు, ఫోన్ బ్యాటరీ త్వరగా డిస్చార్జ్ కావడానికి అసలు కారణాలు.. ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బ్యాటరీ పని తీరు:

ప్రస్తుతం మార్కెట్లో రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఉండే అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్లలోనూ (ఆండ్రాయిడ్, ఐఫోన్) లిథియం-అయాన్ బ్యాటరీలనే వాడుతున్నారు. ఈ బ్యాటరీలు రసాయనిక చర్యల ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తాయి. బ్యాటరీ పూర్తిగా నిండి.. ఉన్నప్పుడు రసాయనిక ఒత్తిడి స్థిరంగా ఉంటుంది. కానీ ఛార్జ్ తగ్గుతున్న కొద్దీ వోల్టేజ్ పడి పోతుంది. ముఖ్యంగా.. 20 శాతం లోపు.. బ్యాటరీ వచ్చినప్పుడు వోల్టేజ్ డ్రాప్ వేగంగా జరిగి..ఫోన్ సర్క్యూట్లు ఎక్కువ కరెంట్‌ను లాగడం ప్రారంభిస్తాయి. దీని వల్ల పర్సంటేజ్ కంటికి కనిపించే వేగంతో పడి పోతుంది.

Advertisement

బ్యాటరీ పవర్ మోడ్:

సాధారణంగా.. ఫోన్ తయారీ దారులు బ్యాటరీని రక్షించడానికి 20 శాతం వద్ద హెచ్చరిక ఇస్తారు. ఈ సమయంలో.. ఫోన్ ఆటో మేటిక్‌‌గా బ్యాటరీని.. పొదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది.అయితే..యూజర్లు ఇంకా ఇంటర్నెట్ వాడటం, వీడియోలు చూడటం లేదా గేమింగ్ కొనసాగించడం వల్ల ప్రాసెసర్‌పై.. ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. తక్కువ ఛార్జ్ ఉన్న సమయంలో.. ప్రాసెసర్ అదే పని తీరును కొనసాగించడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. దీని వల్ల బ్యాటరీ డ్రైనింగ్ వేగం రెట్టింపు అవుతుంది.

Advertisement

Also Read: వాట్సాప్‌లో తెలియని గ్రూప్‌లలో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్ వెంటనే మార్చండి!

బ్యాటరీ హెల్త్, పాత ఫోన్ల సమస్య:

మీ ఫోన్ కొని ఒకటి రెండు సంవత్సరాలు దాటితే.. బ్యాటరీ కెపాసిటీ లేదా హెల్త్ క్రమంగా తగ్గి పోతుంది. ఉదాహరణకు..బ్యాటరీ హెల్త్ 80 శాతానికి పడి పోతే, సిస్టమ్ చూపించే.. 20 శాతం అనేది వాస్తవానికి మరింత తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఫోన్ సడన్‌గా స్విచ్ ఆఫ్ కావడం.. లేదా క్షణాల్లో జీరో పర్సెంట్‌కి వచ్చేయడం జరుగుతుంది. రూ.30,000పై బడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కూడా కాలక్రమేణా ఈ సమస్య కనిపిస్తుంది.

బ్యాటరీ లైఫ్ :

మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నాలీ అంటే.. కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించాలి. బ్యాటరీ ఎప్పుడూ 0 శాతానికి పడి పోయే వరకు వదిలేయకండి. అలాగే 100 శాతం నిండిన వెంటనే ఛార్జర్ తీసేయడం మంచిది.అనవసరమైన లొకేషన్, బ్లూటూత్ , బ్యాక్‌గ్రౌండ్ రిఫ్రెష్‌ను ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీని కాపాడుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ 20 శాతం కంటే.. తక్కువకు పడిపోయిన తర్వాత వేగంగా తగ్గడానికి.. లిథియం-అయాన్ కెమిస్ట్రీ, వోల్టేజ్ డ్రాప్ ప్రధాన కారణాలు.ఈ చిన్న టెక్నికల్ లాజిక్‌ను అర్థం చేసుకుని, తదనుగుణంగా.. మీ ఫోన్‌ను వాడితే.. బ్యాటరీ లైఫ్‌ను మరింత కాలం కాపాడుకోవచ్చు.

Related News

మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!

ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే ఫోన్ హ్యాంగ్ అవుతోందా? మీరు చేసే పొరపాట్లివే!

BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!

రూ.500 లోపే 60 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చే బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ ఇవే!

Airtel యూజర్లకు ఊహించని గిఫ్ట్.. ఏడాది ప్లాన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్రీగా 150GB డేటా!

బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత చవకగా ల్యాప్‌టాప్‌లు.. ఏ మోడల్ కొంటే బెటర్ అంటే?

వాటర్ ప్యూరిఫైయర్స్‌‌పై భారీ డిస్కౌంట్లు..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు

Big Stories

Advertisement
×