Bhagyashri Borse: టాలీవుడ్‌లో గ్లామర్, టాలెంట్‌తో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే తన తాజా ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “నా జీవితాన్ని ఒక రాజకుమారిలా గడుపుతున్నాను” అంటూ ఆమె పెట్టిన ట్రెడిషనల్ లుక్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. పట్టుచీర, సంప్రదాయ ఆభరణాలు ధరించి, దేవకన్యలా మెరిసిపోతున్న భాగ్యశ్రీ అందాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..

తాజా ఫోటోషూట్‌లో భాగ్యశ్రీ బోర్సే అచ్చమైన తెలుగు ఆడపిల్లలా, ఒక రాజకుమారిలా కనిపించింది. చేతితో నేసిన పర్పుల్ రంగు పట్టుచీరలో ఆమె మెరిసిపోయింది. ఇక ఈ పట్టుచీరపై ఉన్న వెండి, బంగారు జరీ వర్క్ ఆమెకు రాయల్ లుక్‌ను తీసుకొచ్చింది. మృదువైన కర్టెన్లు, రోజా పూల రెక్కల మధ్య కూర్చుని ప్రణవ్ ఫోటోగ్రఫీలో ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఈ రాయల్ లుక్ కోసం భాగ్యశ్రీ సాంప్రదాయ బంగారు ఆభరణాలను ఎంపిక చేసుకుంది. నుదుటన మెరుస్తున్న పాపిడి బిళ్ళ, చెవులకు పెద్ద జుకాలు, చేతులకు గాజులతో ఆమె చాలా హోయలు ఒలికించింది. ఇక హెయిర్ స్టైల్, మేకప్ కూడా చాలా సింపుల్‌గా, ఆమె ముఖ వర్చస్సును మరింత పెంచేలా డిజైన్ చేశారు. ఈ క్లాసిక్ స్టైలింగ్‌ను రష్మిత థాపా అద్భుతంగా ప్లాన్ చేశారు.ఇంస్టాగ్రామ్ వేదికగా భాగ్యశ్రీ షేర్ చేసిన ఈ ఫోటోలను చూసి యువత కవిత్వాలు పలుకుతున్నారు.

ఈ అందమైన చీరలో తన మోముకి దగ్గరగా కమల పువ్వును పెట్టుకోవడం చూసి..’ నీ కాటుక కళ్ళకు కమలమే కన్ను గిట్టదా సఖి’.. పండు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.భాగ్యశ్రీ బోర్సే చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా సైమా అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇక తన మొదటి సినిమాతోనే యాక్టింగ్‌తో పాటు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో యూత్‌కు క్రష్‌గా మారిపోయింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్డమ్’ మూవీ తో అలరించింది. అఖిల్ అక్కినేనితో ‘లెనిన్’ సినిమాలతో పాటు తమిళంలో సెయాన్ సినిమాలో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇక తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తన వర్సటైలిటీని నిరూపించుకుంటోంది.

గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, ఇలాంటి ట్రెడిషనల్ లుక్స్‌లో కూడా తాను సరిగ్గా సరిపోతానని భాగ్యశ్రీ బోర్సే ఈ ఫోటోషూట్‌తో నిరూపించింది. ఇక రాజకుమారిలా మెరిసిపోతున్న ఆమె లేటెస్ట్ ఫొటోలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ టాలీవుడ్‌ను ఏలడం ఖాయంగా కనిపిస్తోంది.
also read:Samantha:సమంత డెలివరీ ఎక్కడో తెలుసా?