E-Paper
Advertisement

కాబోయే అమ్మలూ.. వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!

కాబోయే అమ్మలూ.. వర్షాకాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!
Advertisement

Monsoon Health Tips: ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించే వర్షాకాలం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ గర్భిణులకు మాత్రం ఈ సీజన్ కాస్త సవాలుతో కూడుకున్నదే. వాతావరణంలో తేమ, నీరు నిల్వ ఉండటం, దోమల బెడద వల్ల ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందుకే ముంబైలోని నారాయణ హెల్త్ ఎస్ఆర్‌సిసి చిల్డ్రన్స్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ రుజుల్ జవేరి సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోలో కొన్ని ముఖ్యమైన సూచనలు పంచుకున్నారు. అవేంటంటే..

సురక్షితమైన ఆహారం, నీరు:

ఈ కాలంలో టైఫాయిడ్, హెపటైటిస్ ఎ, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువవుతాయి. చిన్న కడుపునొప్పి వచ్చినా డీహైడ్రేషన్‌కు దారితీసి సమస్యలు రావచ్చు. అందుకే ఎప్పుడూ కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు సొంత వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మంచిది. అలాగే రోడ్డు పక్కన దొరికే చాట్ వంటి పదార్థాలకు దూరంగా ఉంటూ, ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బాగా ఉడికించిన కూరగాయలు, గుడ్లు, పాలు, గింజలు వంటి ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి.

Advertisement

Also Read: వర్షాకాలంలో కిడ్నీ సమస్యలకు కారణమయ్యే ఆ తప్పు మీరూ చేస్తున్నారా?

వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం:

తేమతో కూడిన వాతావరణం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. అందుకే తరచూ చేతులు కడుక్కోవడం, కాటన్ దుస్తులు ధరించడం ద్వారా ఇన్ఫెక్షన్లను అడ్డుకోవచ్చు. ఒకవేళ వర్షంలో తడిస్తే వెంటనే పొడి బట్టలను ధరించాలి.

దోమల బారిన పడకుండా:

Advertisement

డెంగ్యూ, మలేరియా, చికన్‌గున్యా వంటి వ్యాధులు గర్భధారణ సమయంలో మరింత ప్రమాదకరం. కాబట్టి.. చేతులు, కాళ్లు పూర్తిగా కప్పేసే దుస్తులు వేసుకోవాలి. దోమతెరలు వాడటం, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. దోమల నివారణ మందులు వాడే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

నడిచేటప్పుడు జాగ్రత్త:

వర్షాల వల్ల రోడ్లు, మెట్లు జారుడుగా ఉంటాయి. కాబట్టి మంచి గ్రిప్ ఉన్న చెప్పులు వేసుకోవాలి. ఒకవేళ ప్రమాదవశాత్తూ కింద పడితే, పైకి ఎలాంటి నొప్పీ లేకపోయినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని సమస్యలు వెంటనే బయటపడవు. అలాగే భారీ వర్షాల్లో బయట తిరగకుండా, ఇంట్లోనే చిన్నపాటి వాకింగ్, యోగా వంటివి చేయాలి. రెగ్యులర్ చెకప్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. కడుపులో బిడ్డ కదలికలు తగ్గినా, బ్లీడింగ్ లేదా తీవ్రమైన కడుపునొప్పి వచ్చినా వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లాలని సూచించారు.

Also Read: ప్రెజర్ కుక్కర్లలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది? కొనే ముందు ఈ క్లారిటీ తెచ్చుకోండి!

Related News

గంధపు చెట్ల మీదే పాములు ఎందుకు ఎక్కువగా నివసిస్తాయి? సువాసన కాదు.. అసలు కారణం ఇది

వర్షాకాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తీవ్రం.. ఇంట్లోనే ఈ డ్రింక్స్‌తో ఉపశమనం

చిన్నప్పుడు ఈ 5 అలవాట్లు ఉన్న పిల్లల్లు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారిని పట్టించుకోరు

బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!

అన్న వద్ద డబ్బు గుంజడమే పని.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సోదరుల చేత ఖర్చు చేయించడంలో దిట్ట

ప్రతి రోజు మేకప్ తొలగించడానికి ఇబ్బందిపడుతున్నారా? నిమిషాల్లో మీ పని పూర్తి చేసే నేచురల్ క్లీన్సింగ్ బామ్ ఇలా చేసుకోండి

పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×