E-Paper
Advertisement

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Bigg Boss 10 Trigun: బిగ్ బాస్ 10తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో నటుడు త్రిగుణ్(Trigun) ఒకరు. ఈయన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో నటుడిగా సందడి చేసిన త్రిగుణ్ ప్రస్తుతం బిగ్ బాస్ 10(Bigg Boss 10) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇలా త్రిగుణ్ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా ఈయన ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్యకు నంది అవార్డు..

ఈ నేపథ్యంలోనే ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిగుణ్ ఇండస్ట్రీలో ప్రకటించే అవార్డుల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు వారి నటనను పరిగణలోకి తీసుకొని అవార్డులు ఇస్తూ ఉంటారు కానీ ఈయన మాత్రం పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వస్తే అవార్డులు వస్తాయి అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిగుణ్ మాట్లాడుతూ.. తాను నటించిన కథ సినిమా (Katha Movie)నాగచైతన్య(Nagachaitanya) నటించిన జోష్(Josh Movie) సినిమా రెండు ఒకేసారి విడుదల అయ్యాయి. జోష్ సినిమాకు నాగచైతన్యకు డెబ్యూ నంది అవార్డును(Nandi Award) ఇచ్చారు. మీరు జోష్ అలాగే కథ రెండు సినిమాలను చూడండి ఎవరు ఎలాంటి పర్ఫామెన్స్ చేశారో మీకే అర్థమవుతుందని త్రిగుణ్ తెలిపారు.

అక్కినేని పేరుకు నంది అవార్డు..

Advertisement

ఆరోజు ఇలాంటి విషయాల గురించి అర్థం చేసుకునే మైండ్ సెట్ నాకు లేదు కానీ, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆరోజు నంది అవార్డు నాగచైతన్యకు ఇచ్చింది కాదని, అక్కినేని పేరుకు ఇచ్చారని త్రిగుణ్ తెలిపారు. నాగచైతన్య అంత పెద్ద అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినందుకు ఆయనకు గుర్తింపుగా నంది అవార్డు ఇచ్చారని తెలిపారు. నాలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తికి ఆ నంది అవార్డు ఇచ్చి ఉంటే నా దృష్టిలో అది ఒక భరతరత్న అవార్డు అయ్యి ఉండేదని త్రిగుణ్ తెలిపారు.

?exln=MzUwcDN2ZmU5cWRj

Advertisement

నా జీవితాంతం ఆ నందిని కడిగి దేవుని గదిలో పెట్టుకొని పూజ చేసే వాడిని. అదే నాగచైతన్యకు ఇవ్వటం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక సెల్ఫ్ లో ఒక అవార్డుగా మాత్రమే మిగిలిపోయిందని తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఉన్నవారికి అవార్డులు వస్తున్నాయి అంటే అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే అవార్డులు వస్తున్నాయి తప్ప వారి నటనకు కాదంటూ ఈయన ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు. ఇలా త్రిగుణ్ నంది అవార్డ్స్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

Related News

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

Big Stories

Advertisement
×