E-Paper
Advertisement

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!
Advertisement

Bucchi Babu: బుచ్చిబాబు పరిచయం అవసరం లేని పేరు. ఉప్పెన సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు(Bucchi Babu) మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అయ్యారు. సినిమాని ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసే అవకాశాన్ని అందుకున్నారు.ఇటీవల వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు పెద్ది సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. ఇకపోతే ఇటీవల విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన రణబాలి సినిమా(Ranabaali Movie) ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

అమ్మాయిలను బంధించి తాళం వేశారు..

ఈ వేడుకలో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన విజయ్ దేవరకొండ గురించి ఆయనకున్న ఫాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బుచ్చిబాబుపై విమర్శలు చేయడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే.. ఈ కార్యక్రమంలో భాగంగా బుచ్చిబాబు మాట్లాడుతూ విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ ఉందని తెలిపారు. అర్జున్ రెడ్డి సమయంలో కాలేజీలో షూటింగ్ జరుగుతుండగా అమ్మాయిలను కంట్రోల్ చేయలేక కాలేజ్ యాజమాన్యం ఏకంగా అమ్మాయిలను గదిలో బంధించి తాళం వేసిందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో పోలికేంటీ బుచ్చి…

Advertisement

విజయ్ దేవరకొండకు పవన్ కళ్యాణ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ బుచ్చి బాబు మాట్లాడారు. ఇలా విజయ్ దేవరకొండను ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోల్చడం పట్ల పవన్ అభిమానులు బుచ్చిబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్, క్రేజీ హీరోతో విజయ్ దేవరకొండను పోల్చడం ఏంటి? ఏమైనా పోలిక చెప్పావా బుచ్చి? అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా బుచ్చిబాబు వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విమర్శించడంతో రంగంలోకి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా దిగుతూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు.

విజయ రష్మికకు పెళ్లి కానుకగా ఇవ్వాలి..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బుచ్చిబాబు రణబాలి సినిమా గురించి కూడా మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్ చూస్తుంటే చాలా భయం వేస్తుందని, ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి తర్వాత మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కావడంతో వీరిద్దరి పెళ్లి కానుకగా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసి వారికి కానుకగా అందించాలి అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి బుచ్చిబాబు మాట్లాడిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

Related News

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×