Maa inti Bangaram:ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ( Shiva Nirvana) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా చేసిన ఖుషీ సినిమా తర్వాత మూడేళ్లు తెలుగు ఇండస్ట్రీకి దూరమైన సమంత(Samantha) .. మళ్ళీ నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో 4వ సారి చేసిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా 100 కోట్ల క్లబ్లో నిలిచిన తొలి ఫిమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డులు సృష్టించింది. అలాంటి ఈ సినిమా ఏకంగా నాలుగు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్ స్టార్ వేదికగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో కూడా జూలై 17వ తేదీ నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఇకపోతే థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు ఓటీటీ లో సినిమా చూసి ఎంజాయ్ చేశారు. మరి ఓటీటీ జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లేని ఆడియన్స్ సంగతేంటి? టీవీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో ? అని ఆసక్తిగా ఎదురు చూసిన ఆడియన్స్ ఎదురుచూపుకు తెరదించుతూ.. సదరు టీవీ చానల్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినీ ప్రియులను ఆనందంలో ముంచేసింది. అసలు విషయంలోకి వెళితే సమంత మా ఇంటి బంగారం సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ స్టార్ మా ఛానల్ దక్కించుకుంది. ఇక ఈ చిత్రాన్ని దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతున్నారు.
also read:సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?
ప్రస్తుతం స్టార్ మా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. “త త త తస్సాదియ్యా.. తగ్గేదేలేదు హోయ్యా.. బంగారం అన్నాక ఆమాత్రం ఉండాలే.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మా ఇంటి బంగారం ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మా లో చూడండి” అంటూ ప్రకటించింది. మొత్తానికైతే సమంత మా ఇంటి బంగారం టీవీలోకి రాబోతోందని ప్రకటించడంతో టెలివిజన్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె మాతృత్వపు క్షణాలను ఎంజాయ్ చేయడానికి సిద్ధమయింది. ఒకవైపు గర్భం మోస్తూనే మరొకవైపు తన కెరీర్ను మరింత బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రముఖ తమిళ్ ఓ టి టి ప్లాట్ఫామ్ సోనీ లివ్ తో ఒక టాక్ షో కి ఒప్పందం కుదుర్చుకుంది. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ అనే ఒక కుకింగ్ షో కి హోస్ట్ గా వ్యవహరించబోతోంది.. అక్టోబర్ 15వ తేదీన రాత్రి 8 గంటలకు సోనీ లీవ్ లో చాలా గ్రాండ్గా ప్రారంభమయ్యే తొలి ఎపిసోడ్ కి సంబంధించిన విడుదల చేసిన ప్రోమో కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.