Telangana Bjp: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల మధ్య అంతర్గత వార్ కంటిన్యూ అవుతుందా? పార్టీ అన్నాక ఇలాంటి విషయాలు సహజమేనా? ఎంపీ అర్వింద్ నోరు ఎత్తడం వెనుక ఏం జరిగింది? రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ కాలేదా? పార్టీకి ఆయన రిజైన్ చేశారా? అవుననే అంటున్నారు సదరు ఎంపీ. అసలు ఏం జరుగుతోంది.
తెలంగాణ బీజేపీలో కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాత నేతల మధ్య అసంతృప్తులు బయటపడ్డాయి. కోరుకున్న పదవి దక్కలేదన్న అసంతృప్తి లోలోపల వ్యక్తం చేశారు కొందరు నేతలు. తమకు అధ్యక్ష పదవి వస్తుందని చాలానే ఆశలు పెట్టుకున్నారు. స్వయంగా హైకమాండ్ కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయడంతో అసంతృప్త నేతలు ఏ ఒక్కరూ నోరు ఎత్తే సాహసం చేయలేదు.
కొత్త అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రిజైన్ వ్యవహారంపై నోరు విప్పారు ఎంపీ ధర్మపురి అర్వింద్. రాజా భాయ్ ఎక్కడున్నా గౌరవిస్తామని చెబుతూనే, ఆయన సస్పెండ్ కాలేదన్నారు. కేవలం రాజీనామా మాత్రమే చేశారన్నారు. ఆయన ఐడియాలాజికల్ మేన్‌గా అని ప్రస్తావించారు.
రేపటి రోజున పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్ షిప్ తీసుకొచ్చన్నారు. ఎందుకు రాజీనామా చేశారనేది బయటకు చెప్పలేదు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాభాయ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన రాజాసింగ్ మళ్లీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పే ప్రయత్నం చేశారు.
ALSO READ: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు
ఇదే క్రమంలో కొన్ని విషయాలు బయటపెట్టారు అర్వింద్. బీజేపీ మాజీ అధ్యక్షుడు-కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల-బండి సంజయ్ వ్యవహారంలో మాట్లాడాలన్నారు. అవసరమైతే అధిష్టానం పెద్దలు మాట్లాడాలన్నారు. సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వయిరీ కమిషన్ వేసుకోవాలని చెప్పుకొచ్చారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలన్నారు. పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం లేకుంటే పక్కకు పెట్టాలన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం అంటూనే, కార్యకర్తలకు నాయకులయ్యే సమయం ఆసన్నమైందన్నారు.
తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని అన్నారు. ప్రతి నాయకులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని మనసులోని మాట బయపెట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఓ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తాము గెలుస్తున్నామని ముందుగా హింట్స్ ఇచ్చేశారు ఎంపీ ధర్మపురి అర్వింద్.
రాజాసింగ్ రాజీనామాపై ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు
రాజా భాయ్ ఎక్కడున్నా గౌరవిస్తాం
ఆయన సస్పెండ్ కాలేదు రిజైన్ చేశారు
రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకొచ్చు
కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజా భాయ్ రాజీనామా చేశారు
– ధర్మపురి అరవింద్ pic.twitter.com/iNzOEOusEB
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2025