Ind vs WI, 2nd Test: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాళ్టి నుంచి మరో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండో టెస్టు ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమ్ ఇండియా, రెండో టెస్టులో కూడా గెలవాలని చేస్తోంది. ఈ మేరకు మూడు రోజుల కిందటే ఢిల్లీకి వచ్చిన టీమిండియా ప్రాక్టీస్ లో చెమటోడ్చనుంది.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. గిల్ సారధ్యంలోని టీమిండియా, ఎలాగైనా గెలవాలని కసితో ఉంది. అటు ఒక మ్యాచ్ అయిన గెలవాలన్న టార్గెట్ పెట్టుకుంది వెస్టిండీస్. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగే రెండో టెస్టు జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు వస్తున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ తీసుకుంటే కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇవాళ్టి మ్యాచ్ లో బుమ్రా లేకుండానే బరిలోకి దిగనుందట టీమిండియా. అతి త్వరలోనే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా టూర్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్ నేపథ్యంలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అందుకే అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
వెస్టిండీస్ జట్టుపై రెండో టెస్టులో టీమిండియా గెలిస్తే బాగా అడ్వాంటేజ్ జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 2027 పాయింట్లు పట్టికలో టీమిండియా మొదటి స్థానంలోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాలి. ఇందులో గెలిస్తే మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగు విజయాలతో నెంబర్ వన్ స్థానానికి వెళుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా శ్రీలంక రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో టీమిండియా నాలుగో స్థానంలో ఇంగ్లాండ్ ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో బంగ్లాదేశ్ ఉండగా ఆరో స్థానంలో వెస్టిండీస్ ఉంది.
Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్….రూ.325 కోట్లతో భారీ స్కెచ్, కాళ్లు మొక్కిన కుర్రాడు
టీమిండియా ప్లేయింగ్ XI అంచనా: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (WK), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI అంచనా: జాన్ కాంప్‌బెల్, టాగ్నరైన్ చంద్రపాల్, అలిక్ అతినాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్ (కెప్టెన్), షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియరీ, జోమెల్ వారికన్, జోహన్ లేన్/జెడియా బ్లేడ్స్, జేడెన్ సీల్స్