E-Paper
Advertisement

కేసీఆర్ పాత్ర అద్భుతంగా చేశావు.. ప్రియదర్శిని సత్కరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే!

కేసీఆర్ పాత్ర అద్భుతంగా చేశావు.. ప్రియదర్శిని సత్కరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే!
Advertisement

Priyadarshi -Harish Rao: నాని ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఒకవైపు ఈ సినిమాపై కొంతమంది నెగెటివిటీని ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమా విడుదలైన ఐదు రోజులకే నైజాం ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.

శంకరన్నగా కేసీఆర్ పాత్ర..

ఇకపోతే ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమ పోరాట నాయకుడు కేసీఆర్(KCR) అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి గురించి కూడా చూపించారు. ఇక కెసిఆర్ పాత్రలో నటుడు ప్రియదర్శి(Priyadarshi) నటించిన విషయం తెలిసిందే. శంకరన్నగా ప్రియదర్శి కేసీఆర్ పాత్రలో ఎంతో ఒదిగిపోయిన నటించారు. ప్రియదర్శి కేసీఆర్ పాత్ర ఉన్నది కేవలం కొన్ని నిమిషాలే అయినప్పటికీ సినిమాకి హైలెట్గా నిలిచిందని చెప్పాలి. ఇలా శంకరన్న పాత్రలో నటించిన ప్రియదర్శికి మాత్రం మంచి ఆదరణ లభిస్తుంది.

ప్రియదర్శికి ఘన సత్కారం..

Advertisement

ఇకపోతే తాజాగా కేసీఆర్ పాత్రలో తన అద్భుతమైన నటనను కనబరిచినందుకు ప్రియదర్శిని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సత్కరించారు. శంకరన్న గా కెసిఆర్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచినందుకు హరీష్ రావు తనని సత్కరించారు. అదేవిధంగా ఇద్దరు కాసేపు పలు విషయాల గురించి కూడా ముచ్చటించారు. ఇందులో భాగంగానే ప్రియదర్శి తన తదుపరి సినిమాల గురించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక హరీష్ రావు కేసీఆర్ పాత్ర గురించి మాట్లాడుతూ..కేసీఆర్ హావభావాలు, నడక, మాటతీరును సహజంగా వెండితెరపై ఆవిష్కరించడం అంత సులభం కాదని తెలిపారు.

కేసీఆర్ పాత్రలో ఒదిగిపోయి నటించారు..

ఇక ప్రియదర్శి మాత్రం కెసిఆర్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. కెసిఆర్ తరహాలోనే హావభావాలను అద్భుతంగా పలికించారని హరీష్ రావు ప్రియదర్శిని అభినందించారు. ఈ సినిమాలో కెసిఆర్ పోరాట స్ఫూర్తిని ప్రజలకు తెలియపరిచిన ది ప్యారడైజ్ చిత్ర బృందానికి కూడా హరీష్ రావు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇకపోతే ఇదివరకు నటించిన సినిమాలన్నీ కూడా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించడం విశేషం.మల్లేశం సినిమాలో తెలంగాణ చేనేత కార్మికుల జీవితాలను, బలగం సినిమా ద్వారా తెలంగాణ పల్లె సంస్కృతి, కుటుంబ బంధాలను తన నటనతో ప్రపంచానికి పరిచయం చేశారని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. ఏలాంటి సినీ నేపథ్యం లేకపోయినా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారని ప్రశంసించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది ప్యారడైజ్ సినిమాలో నాని ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ప్రియదర్శి నటించిన కేసీఆర్ పాత్రకు చాలా మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

Related News

ప్రత్యేకంగా ఆ అభిమానిని కలిసిన తారక్.. వీడియో వైరల్!..

‘గబ్బర్ సింగ్’ రమేష్ కి అండగా నటుడు శ్రీమాన్!

అజిత్ ఒక్కో యాడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

వారణాసి కోసం పోటీ పడుతున్న బడా నిర్మాతలు?

జీవితంలో అప్పు చెయ్యని హీరో ఎవరో తెలుసా..?

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

Big Stories

Advertisement
×