E-Paper
Advertisement

రూ.17,999 ధరకే కేక పుట్టించే 5G టాబ్లెట్.. 8000mAh బ్యాటరీతో Ai+ NovaTab లాంచ్!

రూ.17,999 ధరకే కేక పుట్టించే 5G టాబ్లెట్.. 8000mAh బ్యాటరీతో Ai+ NovaTab లాంచ్!
Advertisement

Ai+ NovaTab: టాబ్లెట్ అంటే ఇప్పుడు కేవలం సినిమాలు, యూట్యూబ్ చూసేందుకు మాత్రమే కాదు.. ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ వర్క్ వరకు రోజువారీ అవసరాల్లోనూ కీలకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, స్టైలిష్ డిజైన్.. ఇవన్నీ ఒకేసారి కోరుకునే వారికి బడ్జెట్‌లో మంచి ఆప్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ టెక్ బ్రాండ్ Ai+ తాజాగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త NovaTab ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో విడుదలైంది. అందుబాటు ధరలోనే మంచి ఫీచర్లను అందించేలా రూపొందించారు.

డిజైన్, డిస్‌ప్లే విశేషాలు:

Ai+ NovaTab డిజైన్ పరంగా చాలా ఆకట్టుకుంటుంది. ఇందులో 11.97 అంగుళాల భారీ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ పెద్ద స్క్రీన్ వల్ల వీడియోలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి, ఆన్‌లైన్ క్లాసులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పైగా 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రీన్ వాడకం చాలా స్మూత్‌గా, వేగంగా అనిపిస్తుంది. డార్క్ బ్లూ, సినమన్ బ్రౌన్ అనే రెండు ప్రత్యేకమైన కలర్స్‌లో ఈ టాబ్ అందుబాటులోకి రానుంది.

Advertisement

Also Read: Apple Pay వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తో పేమెంట్స్ మరింత ఈజీ, ఎలా వాడాలో తెలుసా?

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ పనితీరు:

ఈ టాబ్లెట్‌లో యూనిసాక్ T760 అక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే మల్టీటాస్కింగ్, గేమ్స్ సమర్థవంతంగా రన్ అవ్వడానికి నమ్మకమైన ఆర్మ్ మాలి G57 MC4 GPU గ్రాఫిక్స్ కార్డ్ అందించారు. అత్యంత లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఇది పనిచేస్తుంది. 6GB ర్యామ్, 8GB ర్యామ్ అనే రెండు ఆప్షన్లలో లభించే ఈ రెండు వేరియంట్లలోనూ 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.

కెమెరా, బ్యాటరీ కెపాసిటీ:

Advertisement

సాధారణంగా టాబ్లెట్లలో కెమెరాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు, కానీ నోవాటాబ్‌లో డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి, ఫొటోలు తీయడానికి వెనుక వైపు 13 మెగాపిక్సెల్ AI ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. అలాగే వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక ఈ టాబ్‌కు ప్రధాన ఆకర్షణ దీని 8000mAh భారీ బ్యాటరీ. దీనివల్ల ఛార్జింగ్ గురించిన బెంగ లేకుండా రోజంతా హ్యాపీగా వాడేయవచ్చు.

ధర ఎంతంటే?

ఈ ట్యాబ్లెట్ 5G, వైఫై కనెక్టివిటీ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా నెట్‌వర్క్ సమస్యలు ఉండవు. ఇక ధర విషయానికొస్తే..  6GB ర్యామ్ వేరియంట్ రూ. 17,999కి అలాగే 8GB ర్యామ్ వేరియంట్ రూ.20,999కి లభిస్తాయి. అక్టోబర్ 7 నుంచి Ai+ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ నోవాట్యాబ్ అమ్మకానికి రానుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న ట్యాబ్ కోసం చూస్తున్నవారికి ఇదొక మంచి ఆప్షన్.

Also Read: ఇంటినే థియేటర్‌లా మార్చేసే Lumio Aura 5 స్పీకర్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో!

Tags

Related News

Apple Pay వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తో పేమెంట్స్ మరింత ఈజీ, ఎలా వాడాలో తెలుసా?

కరెంట్ పోల్స్‌పై నంబర్లు ఎందుకుంటాయో.. తెలిస్తే షాకవుతారు!

అక్టోబర్ 1 నుంచి వాట్సప్‌ కొత్త రూల్.. ఒక్కో మెసేజ్‌కు 14 పైసలు ఛార్జీ.. సామాన్యులపై ప్రభావమెంత?

ఇంటినే థియేటర్‌లా మార్చేసే Lumio Aura 5 స్పీకర్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో!

జేబీఎల్ హెడ్‌ఫోన్స్ మస్ట్ బై డీల్స్..అమెజాన్ ఫెస్టివల్ సేల్ స్పెషల్

ఫోన్ ఇచ్చేముందు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు..ఎవరూ మీ పర్సనల్ గ్యాలరీ లేదా యాప్స్‌ని టచ్ కూడా చేయలేరు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో..ఊహించని ధరకే ఎయిర్ ఫ్రైయర్లు

Big Stories

Advertisement
×