E-Paper
Advertisement

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!
Advertisement

NTR -DTTT Pre Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్(Don’t Trouble The Trouble) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. శశాంక్ ఏలేటి దశకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ తన కెరియర్ మొదటి రోజులను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. కార్తికేయ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఎన్టీఆర్ కోరుకున్నారు.

ఒంటరిగానే వెళ్లాను..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తన మొదటి సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. నిన్ను చూడాలని సినిమా పూజ కార్యక్రమాలు జరిగిన రోజును ఈయన గుర్తు చేసుకుంటూ.. ఇప్పటికే ఆరోజున నేను మర్చిపోలేను ఆరోజు రామోజీ ఫిలిం సిటీ లో సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అప్పటికి నా వయసు 16 ఏళ్లు అమ్మని తోడుగా రమ్మంటే రానని చెప్పింది నాన్నను పిలిస్తే మీరే వెళ్లి మీరే దేనిలోనైనా సక్సెస్ అవ్వాలి ఒకరి సపోర్ట్ అవసరం లేదు అంటూ నాన్న కూడా రాలేదని బాధపడ్డారు.

నా బాధను భగవంతుడు విన్నాడు..

Advertisement

ఆ క్షణం తాను ఒంటరిగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లానని ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ నాలో ఏదో తెలియని బాధ ఉందని తెలిపారు. నా అనే వాళ్ళు ఆశీర్వదించడానికి ఒక్కరు కూడా లేరని ఆ క్షణం చాలా బాధపడ్డానని తెలిపారు.. అయితే నా బాధను ఆ భగవంతుడు విన్నాడు, ఈ ప్రకృతి గమనించింది అందుకే నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా రాజమౌళి(Rajamouli), కీరవాణి కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

కార్తికేయ నాకు సొంత తమ్ముడి లాంటివాడు..

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా జక్కన్న కుటుంబాన్ని నాకు ఇచ్చింది ముఖ్యంగా కార్తికేయ నాకు సొంత తమ్ముడిలాంటి వాడు ఒకవేళ మా అమ్మకి ఇంకొక కొడుకు కనుక పుట్టి ఉంటే అది కార్తికేయ అంటూ ఎన్టీఆర్ తెలిపారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో మీ అందరి సపోర్ట్ ఎలా ఉందో కార్తీకేయ సపోర్ట్ కూడా నాకు అలాగే ఉందని ఎన్టీఆర్ తెలిపారు. ఇక జక్కన్నతో నా ప్రయాణం మొదలై 25 సంవత్సరాలు అయింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా 25 సంవత్సరాల వేడుకను ఇలా నా కుటుంబంతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తన హెల్త్ అప్డేట్ కూడా తెలియజేస్తూ తను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, త్వరలోనే డ్రాగన్ సినిమా షూటింగ్లో పాల్గొంటానని అనుకున్న విధంగానే ఈ సినిమా జూన్ 11వ తేదీ విడుదలవుతుందని తెలిపారు.

Advertisement

Also Read: డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా పై  జక్కన్న కామెంట్స్!

Related News

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

అవార్డు వేడుకకు పింక్ చీరలో వచ్చిన నిహారిక.. వెనుక అసలు కథ ఇదే!

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ

డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా పై జక్కన్న కామెంట్స్!

‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×