E-Paper
Advertisement

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Talasani Srinivas: తలసాని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్రంగా నానుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని బీఆర్ఎస్ శ్రేణులు అంటుంటే, తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

హామీల అమలుపై విమర్శల దాడి

Advertisement

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నెరవేర్చలేదని తలసాని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలతో పాటు మహిళలు, రైతులకు ఇచ్చిన రకరకాల మాటలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు. కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, పాలనలో సంక్షేమం పూర్తిగా కొరవడిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సామాజిక న్యాయం ఎక్కడ?

Advertisement

ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరించిన తీరును తలసాని తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో చదువుకున్నవారు, అర్హత ఉన్న నాయకులు ఎవరూ లేనట్టుగా రెండు ఎమ్మెల్సీ పదవులనూ ఒకే సామాజిక వర్గానికి (రెడ్డి) కేటాయించడం ఏమాత్రం తగదన్నారు. బహుజన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు.

పోరాటానికి సిద్ధంగా ఉండాలి

పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తలసాని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున పోరాడేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

Also Read: రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి

Tags

Related News

హైదరాబాద్‌ సిటీలో అగ్నిప్రమాదం.. మంటల్లో ఐదు ట్రావెల్స్ బస్సులు! తగలబెట్టిందెవరు?

చలి చంపేస్తోంది బాబోయ్.. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోకి.. పాలిటెక్నిక్ కళాశాలలు!

దేశ పోలీసు వ్యవస్థకే గ్రేహౌండ్స్‌ రోల్ మోడల్: డీజీపీ సీవీ ఆనంద్

భారత్ సమ్మిట్ పేరుతో దేశానికి అవమానం.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

రియల్టర్​ హత్యకు 10లక్షల సుపారీ.. ఏడుగురు అరెస్ట్!

ఇంటిపై రెండు నిమిషాల పాటు డ్రోన్ కలకలం.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్నలు!

తలవంచి తిరిగి వస్తారా.. లేక ప్రధానిని నిలదీస్తారా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్!

Big Stories

Advertisement
×