Bulli Raju Remuneration:ఇప్పుడు ఎక్కడ చూసినా బుల్లి రాజు ..బుల్లి రాజు.. బుల్లి రాజు.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రేవంత్ ఆలియాస్ బుల్లి రాజు ఇప్పుడు ఒకరకంగా టాలీవుడ్ ని ఏలుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్, అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.అలాంటి బుల్లి రాజు ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అన్న వార్తలపై తెగ ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్ ..
బుల్లి రాజుకి అనిల్ రావిపూడి,వెంకీమామ కాంబోలో వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమా ఎంత గుర్తింపు తెచ్చిందో చెప్పక్కర్లేదు .ఈ సినిమాలో వెంకీ మామ కి కొడుకుగా కనిపించిన రేవంత్ ఆలియాస్ బుల్లిరాజు ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు.ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కొల్లగొట్టడంతో బుల్లి రాజు కి వరుస సినిమాలలో అవకాశాలు క్యూ కట్టేసాయి.
బుల్లి రాజు పారితోషికం విషయానికి వస్తే
అయితే ప్రస్తుతం బుల్లి రాజు పారితోషికం విషయానికి వస్తే ఒక్కో సినిమాకి దాదాపు 70,000 నుంచి 1,10,000 వరకు తీసుకుంటున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది .అయితే భారీ బజ్ ఉన్న సినిమాలకి ఈ పారితోషికం 1 లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో పలుకుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే దీన్ని బుల్లి రాజు గాని తన పేరెంట్స్ కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి .నిజానికి ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ బుల్లి రాజు సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి.ముఖ్యంగా స్క్రీన్ పై అతడు చూపించే హావభావాలు, చెప్పే డైలాగ్స్ ఇవన్నీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి .
చేసిన సినిమాల విషయానికి వస్తే
బుల్లి రాజు చేసిన సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత సింగిల్ అనే సినిమాలో కడుపుబ్బా నవ్వించాడు.ఇక శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కూడా. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాలో కూడా రేవంత్ మంచి పాత్రను పోషించాడు.
ఇక తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమాలో కూడా బుల్లి రాజు ఎలా సందడి చేశాడో చెప్పక్కర్లేదు.అన్నింటికన్నా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చినమన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో బుల్లి రాజు ఎంత సందడి చేశారో చెప్పక్కర్లేదు.
ఇంకెంత ఎత్తుకు ఎదుగుతాడో !
మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడు బుల్లి రాజు తీసుకుంటున్న పారితోషికం పై వస్తున్న వార్తలు టాలీవుడ్ లో అతడికి ఎంతటి గుర్తింపును తీసుకొచ్చాయో నిరూపిస్తున్నాయి. చూడాలి మరి మోస్ట్ వాంటెడ్ అయిపోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ముందు ముందు ఇంకెంత ఎత్తుకు ఎదుగుతాడో !
ALSO READ :బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !