E-Paper
Advertisement

త్రిగుణ్ ఆడే గేమ్ నాకు ముందే అర్థమైంది.. చరణ్ తేజ

త్రిగుణ్ ఆడే గేమ్ నాకు ముందే అర్థమైంది.. చరణ్ తేజ
Advertisement

Bigg Boss Telugu 10:బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక కామన్ మ్యాన్‌గా అడుగుపెట్టిన చరణ్ తేజ.. ప్రేక్షకుల ఓట్లతో మరోసారి హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెల్సిందే. అయితే, రెండోసారి వచ్చిన అవకాశాన్ని ఆయన ఎంతవరకు ఉపయోగించుకున్నాడు ? అనుకున్న స్థాయిలో గేమ్ ఆడగలిగాడా ? అసలు ఎక్కడ వెనుకబడ్డారు? ఇప్పుడు ఇదే విషయాలపై చరణ్ తేజ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

చరణ్ తేజ మాట్లాడుతూ బిగ్ బాస్‌లో గెలవాలంటే టాస్కులు ఆడితే సరిపోదు.. మనం ఏం చేస్తున్నామో ఆడియన్స్‌కు కూడా కనిపించాలి. మన పాయింట్ ఎంత కరెక్ట్‌గా ఉన్నా, దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం.కాని ఈ విషయంలో తాను కొంచెం వెనుకబడ్డానని ఒప్పుకున్నాడు.హౌస్‌లో తాను ఎక్కువగా అరవడం, గొడవలు పడటం కంటే ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నించానని తెలిపాడు.

Advertisement

అయితే ఒకసారి చెబితే ఎదుటివాళ్లకు అర్థమవుతుందని అనుకునేవాడినని, కానీ అదే పాయింట్‌ను మళ్లీ మళ్లీ చెప్పడం వల్లే ఎక్కువగా రిజిస్టర్ అవుతుందని తర్వాత అర్థమైనట్లు తన అనుభవాలని బయటపెట్టాడు. ఇక మిగతా కంటెస్టెంట్లు తమ ఆర్గ్యుమెంట్ ని అస్తమానం వినిపిస్తు హైలైట్ అవుతుంటే, తాను మాత్రం ఒకసారి చెప్పి వదిలేసేవాడినని హౌస్ లో తన ఆట తీరుని వివరించాడు.

ఇక హౌస్‌లో టాస్కులు జరిగినప్పుడు ఎవరు న్యాయంగా ఆడుతున్నారు? ఎవరు రూల్స్ పాటిస్తున్నారు? ఎవరైనా పక్షపాతం చూపిస్తున్నారా? అనే విషయాలను తాను గమనించేవాడినని తెలిపాడు.
ముఖ్యంగా సుధీర్, శ్రుష్టి మధ్య జరిగిన టవర్ టాస్క్ గురించి మాట్లాడుతూ.. శ్రుష్టి తన ఫ్రెండ్ అయినప్పటికీ, ఆమె తప్పు చేస్తే సుధీర్ ఆ టాస్క్‌ను పూర్తి చేయాలని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఫ్రెండ్ కాబట్టి ఒకరికి సపోర్ట్ చేయడం కంటే, గేమ్‌లో ఏది కరెక్టో అదే చెప్పాలని అనుకున్నానని వివరించాడు.

Advertisement

ఇక టాస్కుల్లో తన స్ట్రాటజీల గురించి మాట్లాడుతూ, కొన్ని సందర్భాల్లో తన దగ్గర మంచి పాయింట్లు ఉన్నా వాటిని మరింత బలంగా చెప్పాల్సిందని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
ఒక విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని, ఆ విషయంలో తాను అంతగా దృష్టి పెట్టలేదని తెలిపారు.

ఇక టాప్ కంటెస్టెంట్ల గురించి అడిగినప్పుడు త్రిగుణ్ గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడని చరణ్ తేజ చెప్పారు. రోహిత్, అమన్ కూడా పోటీలో నిలబడే కెపాసిటీ ఉన్నవాళ్లని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. అదే సమయంలో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత హౌస్‌లో పరిస్థితులు మారిపోయాయని , కొంతమంది కంటెస్టెంట్లను టార్గెట్ చేయడం, ఒకరికి మరొకరు సపోర్ట్ చేయడం వంటి పరిణామాలు గేమ్‌పై ప్రభావం చూపి ఉండొచ్చని చెప్పుకొచ్చాడు చరణ్ తేజ.

ALSO READ :బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !

Tags

Related News

‘బాసింగ బలాలు’ పాటతో అదరగొట్టిన వైష్ణవి సోనీ.. అసలు కథ ఇదే!

బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !

సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..

కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..

కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

రోహిత్ వర్సెస్ వంశీ.. శాలిని పై నీతూ ఫైర్.. అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×