E-Paper
Advertisement

బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !

బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !
Advertisement

Bigg Boss Telugu 10:బిగ్ బాస్ హౌస్‌లోకి కామన్ మ్యాన్‌గా అడుగుపెట్టి, ప్రేక్షకుల ఓట్లతో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గేమ్‌పై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.హౌస్‌లో ఐదు వారాల పాటు ఉన్న చరణ్ తేజ రెండుసార్లు ఆడియన్స్ సపోర్ట్ తో అవకాశం దక్కించుకోవడం తనకు మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు.

అయితే ప్రేక్షకులు తనపై పెట్టుకున్న అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయాననే బాధ కూడా తనలో ఉందని తెలిపాడు.ఇక రెండోసారి హౌస్‌లోకి వెళ్లినప్పుడు తన ఆటను మరింత ఇంప్రూ చేసుకోవాలని అనుకున్నప్పటికీ, కొన్ని విషయాల్లో తాను వెనుకబడిపోయాననే తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.

Advertisement

ఏమి జరుగుతుందో అర్థం కాలేదు 

ఇక బిగ్ బాస్ లో మొదటిసారి ఎలిమినేషన్ ఎదురైనప్పుడు కొంత ఆశ్చర్యానికి గురయ్యానని, రెండోసారి కూడా బయటకు రావడంతో ఏమి జరుగుతుందో అర్థం కాలేదని చెప్పాడు. తనకు మరో అవకాశం రావడానికి ప్రేక్షకుల ఓట్లే ప్రధాన కారణమని, వారి సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు.ఇక ప్రేక్షకులు తనను తిరిగి హౌస్‌లోకి పంపించారంటే తనలో ఏదో ప్రత్యేకతను గుర్తించారని భావించినని ఆడియన్స్ పట్ల తన కృతజ్ఞత ని చాటుకున్నాడు. అదే సమయంలో తన ఆటలో మరింత క్లారిటీ ఉండాల్సిందని వివరించాడు .

Advertisement

ఇక ఇతర కంటెస్టెంట్ల లాగా ప్రతి గొడవలోనూ జోక్యం చేసుకోవడం, అనవసరంగా వాదనలను పెంచడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పాడు. అలా చేస్తే ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, తన వ్యక్తిత్వానికి సరిపోని విధంగా ప్రవర్తించడం ఇష్టం లేదని స్పష్టం చేశాడు.

రోహిత్‌తో తనకున్న స్నేహం గురించి

ఇదే సమయంలో రోహిత్‌తో తనకున్న స్నేహం గురించి కూడా చరణ్ తేజ ఆసక్తికరంగా మాట్లాడాడు. మొదట్లో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని, అయితే రోజులు గడిచేకొద్దీ తమ మధ్య కొంత దూరం పెరిగినట్లు అనిపించిందని తెలిపాడు. తాను మాత్రం స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తానని, ఎదుటివారు కూడా అదే స్థాయిలో స్పందించాలని ఆశిస్తానని అన్నాడు.

గతంలో తాను స్నేహితులను మాత్రమే కాకుండా, స్నేహం అనే అనుభూతిని కూడా మిస్ అవుతున్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.ఇక హౌస్‌లో స్నేహాలు, గొడవలు, ప్రేమ వ్యవహారాలు వైరల్ అవుతాయన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే బాండింగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది కూడా.అయితే చరణ్ తేజ మాత్రం వర్షిణితో తనకున్న పరిచయాన్ని అలా చూడలేదని,దానికి ఎలాంటి అర్థాలు ఆపాదించాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

వంశీ వ్యవహరించిన తీరుపై కూడా

మరోవైపు హౌస్‌లో వంశీ వ్యవహరించిన తీరుపై కూడా చరణ్ తేజ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రతి గొడవలోనూ కనిపించడం, తనకు సంబంధం లేని విషయాల్లో కూడా మాట్లాడటం ద్వారా కొందరు కంటెస్టెంట్లు ఎక్కువగా హైలైట్ అవుతారని అయితే అలా కనిపించడమే మంచి గేమ్‌ అని తాను అనుకోనని తెలిపాడు. ఒక అంశంపై మాట్లాడే ముందు దాని గురించి ఆలోచించడం, అవసరమైతేనే స్పందించడం తన పద్ధతి అని చెప్పాడు.ఏదేమైనా, రెండుసార్లు ప్రేక్షకుల ఓట్లతో అవకాశం దక్కించుకున్నపటికీ దాన్ని నిలబెట్టుకోకపోవడం ఫాలోవర్స్ ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి !

ALSO READ :కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

Tags

Related News

త్రిగుణ్ ఆడే గేమ్ నాకు ముందే అర్థమైంది.. చరణ్ తేజ

సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..

కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..

కార్తీకదీపం 2 సీరియల్ లో జోత్స్న మిస్సింగ్… ఎందుకు తప్పుకున్నారో తెలుసా?

నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

రోహిత్ వర్సెస్ వంశీ.. శాలిని పై నీతూ ఫైర్.. అసలేం జరుగుతోంది?

వేలల్లో సబ్స్క్రైబర్స్..లక్షల్లో సంపాదన.. విష్ణు ప్రియ నెల సంపాదన తెలిస్తే మతి పోవాల్సిందే!

Big Stories

Advertisement
×