War 2:హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, ఎన్టీఆర్ (NTR) విలన్ గా భారీ యాక్షన్ మూవీగా రాబోతున్న చిత్రం వార్ 2 (War 2). కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్ గా నటిస్తోంది. అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా(Adithya chopra) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసుకుంది. హిందీ, తెలుగు, తమిళ్ భాషలో ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా ఈరోజు హైదరాబాదులోని యూసఫ్ గూడాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. కానీ వర్షాల కారణంగా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ప్రీ రిలీజ్ డైలాగ్ ప్రోమో విడుదల..
ఒకవేళ వరుణుడు కరుణిస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా అభిమానులకు యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి తాజాగా ప్రీ రిలీజ్ డైలాగ్ ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కి సంబంధించిన డైలాగ్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతం తెలుగులో విడుదల చేసిన ఈ ప్రీ రిలీజ్ డైలాగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది.
ఆకట్టుకుంటున్న డైలాగ్స్..
ప్రోమో విషయానికి వస్తే 34 సెకండ్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలో “నో రూల్స్.. నో రా .. నువ్వు నేను” మాత్రమే అంటూ హృతిక్ డైలాగ్ తో ఈ ప్రోమో ప్రారంభం అవుతుంది. “గెలిచినవాడు ఫస్ట్.. సెకండ్ వచ్చిన వాడి చాప్టర్ క్లోజ్” అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ఆకట్టుకుంది. ఇక తర్వాత మంచు కొండల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఫైట్ సీన్ హైలెట్ చేశారు. అలాగే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని ప్రోమో ద్వారా తెలియజేశారు.
వార్ 2 Vs కూలీ..
మరొకవైపు ఆగస్టు 14వ తేదీన లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth ) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా కూడా విడుదల కాబోతోంది. వార్ 2 చిత్రంతో పోల్చుకుంటే కూలీ సినిమాకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాను బీట్ చేయడం సాధ్యపడదు అని నిర్మాతలు ఆలోచించారేమో తెలియదు కానీ.. వార్ 2 కి సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆగస్టు 14న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వార్ 2 వర్సెస్ కూలీ యుద్ధం జరగబోతోంది. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం పై చేయి సాధిస్తుందో చూడాలి..
ALSO READ:Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?