Dharma Mahesh: సమాజంలో చాలా జాగ్రత్తగా బతకాలి. ముఖ్యంగా సెలబ్రిటీ హోదాలో ఉంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టే చూసే సమాజంలో ఉన్నాం కాబట్టి. ఈరోజుల్లో సోషల్ మీడియా అధికంగా ఉంది కాబట్టి, ఆచితూచి అడుగు వేయాలి. ఒక చిన్న తప్పిదం మన వల్ల దొర్లినా కూడా అది క్షణాల్లో పబ్లిక్ అయిపోతుంది.
భార్యపై వేధింపులు
ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఒక యంగ్ హీరో మీద కేసు నమోదు అయింది. సిందూరం’ (2023), ‘డ్రింకర్ సాయి’ చిత్రాల్లో హీరోగా నటించిన ధర్మ మహేశ్ పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ మహేశ్ మరియు అతని కుటుంబ సభ్యులపై నటుడి భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వరకట్నం వేధింపులకు సంబంధించి గతంలో ధర్మ మహేశ్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇకనైనా మారుతాడా
గతంలో పోలీసులు ఇదివరకే కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మళ్లీ ఇది రిపీట్ అయింది. కేసు నమోదైన తర్వాత కూడా మారుతాడా లేదా అనేది చాలామంది సందేహం. ఇకపోతే ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన హీరో ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేది చాలామంది అభిప్రాయం. జీవితం అనుకుంటున్నాడా సినిమా అనుకుంటున్నాడా అంటూ మహేష్ పైన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
Also Read: Naga Vamsi: అప్పుడు ముంబై నిద్రపోలేదు, ఇప్పుడు నువ్వు పడుకుంటున్నావా అన్న?