Salman Khan:ఇటీవల కాలంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు కొంతమంది ప్రముఖులు ఇలా స్కామ్ కేసుల్లో ఇరుక్కొని అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు భూ కబ్జా కేసుల్లో ఇరుక్కుంటుంటే.. మరికొంతమంది వ్యాపారం పేరిట డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అంటూ బాధితులు లబోదిబోమంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan)ఆయన సోదరి అల్విరాఖాన్ (Alvira Khan) కూడా చిక్కుల్లో పడ్డారు. ఏకంగా రూ.2నుండి రూ.3కోట్ల భారీ స్కాం కేసులో ఇరుక్కోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సల్మాన్ ఖాన్ , ఆయన సోదరి అల్విరా ఖాన్ లకు చండీఘడ్ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా వారి స్వచ్ఛంద సంస్థ అయిన బీయింగ్ హ్యూమన్ జ్యూవెలరీ కి సంబంధించిన రూ.2 నుండి 3 కోట్ల మోసం జరిగిందన్న ఫిర్యాదుపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అసలు విషయంలోకి వెళ్తే.. చండీగఢ్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం..” 2018లో ‘బీయింగ్ హ్యూమన్ జ్యూవెలరీ’ ఫ్రాంచైజీ స్టోర్ ను ప్రారంభించడానికి సుమారుగా రూ.2నుండి రూ.3కోట్ల వరకు మేము పెట్టుబడి పెట్టాము. షో రూమ్ ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ స్వయంగా వస్తారని , బ్రాండ్ ప్రమోషన్లతో పాటు క్రమం తప్పకుండా ప్రోడక్ట్స్ స్టాక్ పంపుతామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీ ప్రకారం ఎటువంటి స్టాక్ సరఫరా చేయలేదు. పైగా ప్రమోషన్లకి కూడా ఎవరూ రాలేదు. తమ బకాయిలపై స్పందించడం లేదు” అంటూ బాధితులు న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
also read:ముగిసిన ‘లాక్ అప్ 2’.. విన్నర్ ఎవరు? ట్రోఫీ, రూ.1 కోటి నగదుతో పాటూ?
దీనిపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ కోర్టు సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన చెల్లెలు అల్విరా ఖాన్ అలాగే బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈవో , లైసెన్సీ సంస్థ అధికారులకు చండీగఢ్ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి దీనిపై సల్మాన్ ఖాన్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ఇలా భారీ స్కామ్ కేసులో సల్మాన్ ఖాన్ ఇరుక్కున్నారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇటు సౌత్ సినిమాలలో కూడా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. SVC 63 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా థియేటర్లలో అధికారికంగా విడుదల చేయనున్నారు.