E-Paper
Advertisement

సుధీర్ ది రియల్ హెయిర్ కాదా?విగ్గా? బయటపడ్డ నిజం!

సుధీర్ ది రియల్ హెయిర్ కాదా?విగ్గా? బయటపడ్డ నిజం!
Advertisement

Sudigali Sudheer:అమ్మాయిలు అందంగా కనిపించడానికి ముఖానికి ఎలా అయితే మేకప్ లు వేసుకుంటారో.. అబ్బాయిలు కూడా అందంగా కనిపించడానికి సహజంగానే మేకప్ వేస్తారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటింది అంటే బట్టతల వస్తున్న విషయం తెలిసిందే. ఇక దానిని కవర్ చేయడానికి ఏవేవో మార్గాలు వెతుకుతూ ఉంటారు. మరి సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటుంటే .. మరి కొంత మంది వ్యక్తులు విగ్ పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ది కూడా రియల్ జుట్టు కాదా? అంటూ ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా (Roja)లేవనెత్తిన ప్రశ్న అందరిలో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) నేను చెక్ చేస్తాను అంటూ వెళ్లిన తీరు అందరిలో ఉత్కంఠ రేకెత్తించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అందరూ కట్టుకలసి సుదీర్ పరువు తీస్తున్నారా?

జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సుధీర్.. ఆ తర్వాత హోస్ట్గా ఎదిగి ఒక్కో షోలో తనదైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అటు సినిమాలలో కూడా హీరోగా నటించి ప్రేక్షకులను అలరించిన సుధీర్. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ.. బిజీగా మారిపోయారు. ముఖ్యంగా చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎవరు ఎన్ని మాటలన్నా చాలా తేలికగా తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచే సుధీర్ కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఆయన అభిమానులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఈ విషయం విన్న సుధీర్ అభిమానులు.. కావాలనే అందరూ కలిసికట్టుగా సుధీర్ పరువు తీయాలనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సుధీర్ పై పిల్లలతో పంచ్.. అభిమానుల ఆవేదన..

Advertisement

దిగ్గజ దర్శకుడు అనిల్ రావిపూడి, స్టార్ నటుడు శ్రీకాంత్(Srikanth ), సీనియర్ హీరోయిన్ రోజా ముగ్గురు జడ్జెస్ గా, సుధీర్ హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో ‘డ్రామా జూనియర్’. ధన్య బాలకృష్ణ ఇందులో మెంటార్ గా పనిచేస్తుంది. ఇకపోతే డ్రామా జూనియర్స్ షోలో సుధీర్ మీద పిల్లలు వేస్తున్న పంచులు, కౌంటర్లు హద్దులు దాటుతున్నాయనే కంప్లైంట్ ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సుధీర్ అభిమానులు కూడా హార్ట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన అభిమానులను మరింత హర్ట్ చేసేలా విడుదల చేసిన ప్రోమో అభిమానుల ఆగ్రహానికి దారితీస్తోంది.

also read:రూ.3 కోట్ల స్కామ్ లో సల్మాన్ ఖాన్,ఆయన సోదరి?

సుధీర్ ది రియల్ జుట్టు కాదా?

Advertisement

విషయంలోకి వెళ్తే సుధీర్ లాగ ఒక పిల్లాడు నటించాడు. రేయ్ ట్యాన్ అవుతున్నా.. గొడుగు పట్టరా అని ఆ పిల్లాడు అంటే.. నువ్వు ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చావు అన్న అని ఇంకొకడు అడుగుతాడు. 2012లో రా అని అంటాడు. అప్పుడే నువ్వు ట్యాన్ అయ్యావ్ అన్నా అని కౌంటర్ వేస్తాడు. ఇక ఆడియన్స్ లో నుంచి ఒక అమ్మాయి నువ్వు హీరోలా ఉన్నావు అని అంటే.. హీరోని పట్టుకొని హీరోలా ఉన్నావ్ అంటే ఫీల్ అవ్వరా అంటూ సుధీర్ గెటప్ లో ఉన్న ఆ పిల్లోడు కౌంటర్ వేశాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు తన విగ్గు తీసేస్తాడు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. వెంటనే రోజా..” సుధీర్ ది ఇన్ని రోజులు రియల్ హెయిర్ అనుకున్నాం.. కాదా.. అది విగ్గా?” అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంది. దీనికి అనిల్ రావిపూడి ..”మీరు అన్నది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తామంటూ ” తన జడ్జి సీట్లో నుంచి సుధీర్ వైపు వెళ్తాడు. అటు శ్రీకాంత్ కూడా సుదీర్ దగ్గరకు వస్తారు. అనిల్ రావిపూడి సుధీర్ జుట్టును పట్టుకునే ప్రయత్నం చేయగా.. సుధీర్ వద్దని వారించారు. ఎట్టకేలకు అనిల్ రావిపూడి సుధీర్ జుట్టును పట్టుకోగానే సుదీర్ మౌనం వ్యక్తం చేయగా.. అంతలోనే ప్రోమో కట్ చేశారు. మరి అందరూ అనుకుంటున్నట్టు ఆయనది రియల్ జుట్టా లేక విగ్గా అనేది తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×