E-Paper
Advertisement

Chiranjeevi Free Education Project: రక్తదానం తర్వాత విద్యదానం..ఉగాది సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి..!

Chiranjeevi Free Education Project: రక్తదానం తర్వాత విద్యదానం..ఉగాది సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి..!
Advertisement

Chiranjeevi Free Education Project: తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక నటుడు కాదు, సేవా భావంతో ముందుకు వచ్చే వ్యక్తి కూడా. సినిమాలతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన నిర్వహిస్తున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా వేలాది మందికి సహాయం అందింది. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా, ప్రకృతి విపత్తులు జరిగినా ఆయన ముందుగా స్పందించి సహాయం చేస్తారు.

రక్తదానంతో ఆగను..!

ఇప్పుడు మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో ఆయన తన కొత్త ఆలోచనను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “రక్తం ప్రాముఖ్యత ఏమిటో, రక్తం లేక ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసుకున్నప్పుడు, అందరిని రక్తదానం చేయాలని ప్రోత్సహించాలనిపించింది. ఆ ఆలోచన నాకు 25 సంవత్సరాల క్రితం వచ్చింది.” అని చెప్పారు.

Advertisement

అంతటితో ఆగిపోకుండా, ఆయన భవిష్యత్తులో పేదలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ విషయంపై ఆయన ఇలా చెప్పారు: “అక్కడితో ఆగాలని నేను అనుకోవడం లేదు. భవిష్యత్తులో పేదలకు విద్య ఎలా అందించాలా అని ఆలోచిస్తున్నాను. నా ప్రేరణతో సూర్య గారు అగరం ఫౌండేషన్ ప్రారంభించారు. ఇప్పుడు నేను కూడా ఆయన నుంచి ప్రేరణ తీసుకుని ఉచిత విద్య అందించాలనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అవసరం ఉన్న ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను.”

ఇప్పుడు విద్యాదానం కూడా..!

చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పది. చదువు అనేది ప్రతి ఒక్కరికీ అందాల్సిన హక్కు. కానీ ఇంకా చాలా మంది పిల్లలు ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.

Advertisement

ఈ ఉచిత విద్య ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభమైతే, మరెంతో మందికి వెలుగునిస్తుంది. చిరంజీవి మరోసారి తన సేవా భావాన్ని నిరూపిస్తూ నిజ జీవితంలో కూడా హీరోగా నిలుస్తున్నారు.

ALSO READ: Prabhu Deva: ₹35 లక్షల లాభం కోసం 14 ఏళ్లు ఎదురుచూసిన ప్రభుదేవా.. ఇదేమి కర్మ రా బాబు..!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×