Irumudi Movie : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడి. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ని అందుకుంటూ మరోవైపు విమర్శలని ఎదుర్కొంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా జనాలకు పూనకాలు తెప్పిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా ఈ సినిమాలో మల్లెపూల పల్లకి సాంగ్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాంతో సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. ధమాకా తర్వాత రవితేజకు అంతకుమించి భారీ క్రేజ్ ని అందించిన సినిమా ఇరుముడి.. అయితే ఈ మూవీ కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ అవుతున్నాయి. మరి మొదటివారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చిందో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
రవితేజ, ప్రియా భవాని శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇరుముడి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ తో పాటు విమర్శలు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కలెక్షన్స్ తో పాటుగా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఎన్ని ట్రోల్స్ వినిపిస్తున్న సరే ఈ సినిమా కలెక్షన్స్ లో మాత్రం ఎటువంటి డోకా లేదు.. రోజురోజుకీ కలెక్షన్ల సునామి సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తగ్గింది. ఈ క్రమంలో నైజంలో ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఆసక్తికరంగా మారాయి. ఈ చిత్రం నైజాం మార్కెట్ లో అదరగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏడవ రోజు సినిమాకు దాదాపుగా మూడు కోట్లు వసూల్ అయినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. ‘ఇరుముడి’ మొత్తం ఈ 7 రోజుల్లో 26 కోట్లకి పైగా షేర్ ని రాబట్టినట్టు సమాచారం. ఈ కలెక్షన్స్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
మాస్ మహారాజ రవితేజ ఎప్పుడు యాక్షన్ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించేవారు.. కానీ ఆయన ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేయాలి అని ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో రవితేజ ఇరుముడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.. ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలుపెట్టింది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా టాక్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. సినిమా వచ్చి వారం రోజులు అయినా కూడా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక ఇప్పటికీ కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తూ ఉండడం విశేషం.. ఇక ఇటీవల సినిమా థియేటర్లు పెంచాలి అంటూ అభిమానులు డిమాండ్లు చేస్తూ రోడ్డుకి ఎక్కిన వీడియోలు కూడా కనిపిస్తున్నాయి.. వీటితో పాటుగా బ్లాక్లో కూడా ఈ టికెట్లను అమ్ముతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది.. ఇదే రన్ లో ఈ సినిమా ముందుకు వెళితే మాత్రం ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ రవితేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..
Also Read :సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ స్టోరీ ఇదే..