E-Paper
Advertisement

తమ్ముడి విష్.. అన్నయ్య ఎమోషనల్ రిప్లై.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే!

తమ్ముడి విష్.. అన్నయ్య ఎమోషనల్ రిప్లై.. మెగా ఫ్యాన్స్‌కి పూనకాలే!
Advertisement

Chiranjeevi Emotional Reply :మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకి ఎమోషనల్ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాను వెండితెరపై హీరో కాకముందే తనకు నిజమైన హీరో చిరంజీవేనని, కాలేజీ రోజుల్లో అన్నయ్య పక్కన నడవడం తనకు ఎంతో గర్వంగా అనిపించేదని, చిన్నతనంలో ఆయన చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మరచిపోలేనిదని తన విషెస్ లో చెప్పుకొచ్చారు పవన్.

చిరు బర్త్ డే విషెస్ చెప్పిన పవన్ 

ఇక చిరంజీవి మొదటిసారి సింగపూర్ వెళ్లినప్పుడు తెచ్చిన బ్లూ బ్యాగ్‌లో లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, కామిక్ పుస్తకాలు, మ్యూజిక్ క్యాసెట్లు ఉండేవని, ఆ జ్ఞాపకాలు తన మనసులో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని పవన్ గుర్తు చేసుకున్నారు. అన్నయ్యకు పెళ్లి అయిన కొత్తలో, ఆయన ఇక తనకు దూరమైపోతారేమోనన్న భయంతో గదిలో కూర్చుని ఏడుస్తుంటే, చిరంజీవి తన భార్యను తీసుకొచ్చి ‘నీకో పెద్ద మనిషిని పరిచయం చేస్తా’ అంటూ నవ్వించి భయాన్ని పోగొట్టిన తీరును వివరించారు. . చదువులో లేదా జీవితంలో అపజయాలు  ఎదురైనప్పుడు చిరంజీవి ఎప్పుడూ తనను నిందించలేదని, నిరంతరం అండగా నిలిచారని పవన్ పంచుకున్నారు.

Advertisement

సూపర్ స్టార్‌గా ఎదగడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం వంటి ఎన్నో విజయాలు సాధించినా చిరంజీవిలోని కష్టపడే తత్వం మాత్రం మారలేదని అన్నారు. ఇటీవల పెద్ద సర్జరీ జరిగిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే కోలుకుని పనిచేయడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు.

తమ్ముడి మాటలకి చిరు ఎమోషనల్ రిప్లయ్ 

Advertisement

ఇక తమ్ముడి ఎమోషనల్ పోస్ట్ కి చిరంజీవి కూడా అంతే హృదయపూర్వకంగా రియాక్ట్ అయ్యారు. “మై డియర్ కళ్యాణ్ బాబు” అంటూ పవన్ మాటలు తమ జీవితంలోని ఎంతో విలువైన జ్ఞాపకాలను కళ్లముందు నిలిపాయని, వాటిని చదివి తాను కంటతడి పెట్టానని చెప్పారు. అన్నయ్యగా తాను చేసినదంతా తమ్ముడిపై ఉన్న ప్రేమతో, బాధ్యతతోనే చేశానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు పవన్ ప్రజల కోసం చూపిస్తున్న ధైర్యం, నిబద్ధత, నిస్వార్థమైన ప్రయాణం మరియు దేశంపై ఉన్న ప్రేమను చూస్తుంటే ఒక అన్నగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

also read :సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ జై కొట్టిందా?.. లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!

ప్రేమని గొప్పగా చాటుకున్న మెగాస్టార్

పవన్ లక్షలాది మందికి బలమైన స్ఫూర్తిగా మారాడని చిరంజీవి ప్రశంసించారు. “నువ్వు నన్ను నీ హీరో అంటున్నావు, కానీ నీ పట్టుదల, నిజాయితీ నన్ను కూడా ఎన్నో విధాలుగా స్ఫూర్తి పొందేలా చేశాయి” అని చిరంజీవి చెప్పిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అందమైన జ్ఞాపకాలను కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, పవన్ చూపించే ప్రేమ తన జీవితంలో దొరికిన గొప్ప ఆశీర్వాదమని పేర్కొన్నారు. చివరిగా “లవ్ యూ ఆల్వేస్ కళ్యాణ్ బాబు” అంటూ అన్నయ్యగా తన ప్రేమని గొప్పగా చాటుకున్నారు మెగాస్టార్ చిరు !

Tags

Related News

2 ఇళ్లల్లోనే మొత్తం షూటింగ్.. బడ్జెట్ మాత్రం బారెడు.. కలెక్షన్స్ ఎంత?

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ జై కొట్టిందా?.. లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!

ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ము దులిపేస్తున్న రవితేజ!

అన్నయ్య పుట్టినరోజు స్పెషల్.. ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు ఏం చేశారంటే?

పట్టాలెక్కి ఆగిపోయిన చిరంజీవి చిత్రాలు..లిస్ట్ పెద్దదే!

హీరో కాకముందే నా హీరో.. చిరంజీవిపై పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

రెండక్షరాల టైటిల్.. అంచనాలు పెంచేస్తోన్న మెగా హీరోలు!

Big Stories

Advertisement
×