Netflix South:నెట్ ఫ్లిక్స్ …ఈ పదం వినగానే ఒకప్పుడు మనందరికీ హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లే గుర్తుకువచ్చేవి.ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆ రేంజ్ లో ఇంగ్లీష్ కంటెంట్ స్ట్రీమింగ్ చేసేది మరి.కాని కాలం మారింది.OTT లు మూకుమ్మడిగా దూసుకొస్తూ గట్టి పోటీ నిస్తుండటంతో పంథా మార్చింది నెట్ ఫ్లిక్స్.
ఈ క్రమంలోనే థియేటర్ల కన్నా OTT లకే బాగా అలవాటైన సౌత్ ఆడియన్స్ ని ఫోకస్ ని గ్రాబ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇపుడు సరికొత్త డిసీషన్ తీసుకుంది.ఇందులో భాగంగానే 2026లో వచ్చే నెలల్లో ప్రతీ వారం తమిళం, తెలుగు లేదా మలయాళం నుంచి కనీసం ఒక కొత్త సినిమానైనా ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు నిర్ణయించుకుందట నెట్‌ఫ్లిక్స్.
అంటే థియేటర్ లలో ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాల డిజిటల్ రైట్స్ తో పాటు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సినిమాలని, సిరీస్‌లను కూడా ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేయనున్నారట.అంటే ఇప్పటి వరకు హాలీవుడ్ అండ్ నార్త్ సినిమాలకే పెద్ద పీట వేసిన నెట్ ఫ్లిక్స్ ఇపుడు సౌత్ కంటెంట్‌కు పట్టం కట్టబోతుందన్న మాట.
ఇక నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ లైనప్ లో ముందుగా ఫోకస్ చేసిందని వినిపిస్తున్న సినిమా ధనుష్, మమ్ముట్టి కలిసి నటించిన ‘OM – Chapter 1: ఉదిరం’. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది.ఇక ధనుష్‌కు తమిళంతో పాటు నేషనల్ వైడ్ గా ఉన్న మార్కెట్,అలాగే మమ్ముట్టికి మలయాళంతో పాటు ఇతర భాషల్లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై ఓటీటీ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఇదే లైనప్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ నటించిన పీరియాడిక్ డ్రామా రణబాలి (Ranabaali) ,రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాలో జయమ్మగా రష్మిక నటిస్తుందన్న సంగతి తెల్సిందే.ఇక పెళ్లి తర్వాత ఈ జోడీ మరోసారి జత కట్టడం, అలాగే రౌడీ హీరోకున్న నేషనల్ వైడ్ క్రేజ్ ఈ సినిమాకి కలిసి వస్తుందన్న నమ్మకంతో టేకప్ చేసేందుకు సిద్దమైంది నెట్‌ఫ్లిక్స్ ఇండియా .
ఇక వీటితో పాటు న్యాచురల్ స్టార్ నటిస్తున్న ది ప్యారడైజ్ పై కూడా ఓ కన్నేసింది.దసరా వంటి సూపర్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల , నాని కాంబోలో వస్తున్న సినిమా కావడం, పైగా మోహన్ బాబు, సంపూర్నేష్ వంటి క్రేజీ క్యాస్టింగ్ ఉండటం, మరో వైపు ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ హైప్ పెంచేయడంతో ఫ్యారడైజ్ ని పిక్ చేసుకుందట నెట్‌ఫ్లిక్స్ ఇండియా.పైగా థియేటర్లకి మించి నాని సినిమాలకి OTT లలో రిపీట్ వాల్యూ ఉంటుందని చెప్పక్కర్లేదు కూడా.
ఇక ఇవే కాకుండా నెట్‌ఫ్లిక్స్ స్వయంగా నిర్మిస్తున్న స్టీఫెన్ ,తక్షకుడు, లెగసీ వంటి క్రేజీ ఒరిజినల్స్ రెడీ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ లో నెట్‌ఫ్లిక్స్ తీసుకొస్తున్న తొలి ఒరిజినల్ సిరీస్ ది గేమ్ పై భారీ అంచనాలే పెట్టుకుంది నెట్‌ఫ్లిక్స్.ముఖ్యంగా తమిళ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని వస్తున్న ఈ సిరీస్ ద్వారా తమిళనాట డిజిటల్ స్ట్రీమింగ్ లో మరింత పాతుకుపోవాలని చూస్తుంది.
ఇక ఇటీవల విడుదలైన తెలుగు కామెడీ టైటిల్ ‘సూపర్ సుబ్బు’ కూడా నెట్‌ఫ్లిక్స్ ఇండియాస్ట్రాటజీలో భాగమే. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఓటీటీలో ఎప్పుడూ డిమాండ్ ఉండటంతో ఇలాంటి జానర్లను కూడా నెట్‌ఫ్లిక్స్ ఇపుడు ఎంకరేజ్ చేసేపనిలో పడింది.
also read :ఈశ్వర్ సాయి వైఫ్ కామెంట్స్‌పై శేఖర్ వైరస్ సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పకపోతే అంతే!
నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ చెప్పినట్టుగా.. సౌత్ ఇండియా నుంచి ప్రతి వారం కొత్త సినిమాకాని ,సిరీస్ ని కాని నిజంగానే నెట్ ఫ్లిక్స్ లో వస్తే మాత్రం రాబోయే నెలల్లో ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.