E-Paper
Advertisement

ఇంత యంగ్‌గా ఎలా ఉంటారు? చిరంజీవి చెప్పిన ఆన్సర్ ఇదే!

ఇంత యంగ్‌గా ఎలా ఉంటారు? చిరంజీవి చెప్పిన ఆన్సర్ ఇదే!
Advertisement

Chiranjeevi Fitness:70 ఏళ్ళు ..ఈ వయసులో ఎవరైనా ఏం చేస్తారు ..కృష్ణా రామా అనుకుంటూ రామ కోటి రాస్తుంటారు.కానీ మెగా స్టార్ చిరు మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులని తిరగరాస్తున్నారు.ఏడు పదులు దాటి ఒక ఏడు గడిచినా ఇంకా నేనింకా మూడు పదుల కుర్రాడినే అంటూ అలవోకగా సినిమాలు చేసుకుపోతున్నారు.దీంతో ఎవరికైనా చిరు ఫిట్ నెస్ సీక్రెట్ ఏమై ఉంటుందా అంటూ అనుమానాలు రావడం సహజం.ఇక ఇదే విషయాన్నీ కొంతమంది చిరు ముందు బయటపెట్టారట కూడా.ఇదే విషయాన్ని ఒక ఈవెంట్లో ఇలా చెప్పుకొచ్చాడు మెగాస్టార్.

మీరు ఇంత యంగ్ గా ఉండటానికి కారణం

Advertisement

చిరు మాట్లాడుతూ చాలా మంది ”మీరు ఇంత యంగ్ గా ఉండటానికి కారణం ఏంటని నన్ను అడుగుతూ ఉంటారు.మాములుగా ఎవరైనా సరైన సమయానికి తినడం,డైట్ సరిగ్గా ఫాలో అవడం ,విటమిన్స్ డిఫీషియన్సీ లేకుండా చూసుకోవడం వంటివేవో చెబుతుంటారు.కానీ అవేవీ కావు ..నేను ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం కేవలం కృతజ్ఞత అని తెలిపారు.

కృతజ్ఞత పూర్వకంగా ఉండటం వల్లే 

Advertisement

తనకి జన్మనిచ్చిన అమ్మా ,నాన్నలకి ,అవకాశాలు ఇచ్చిన నిర్మాతలకి, మంచి వేషాలు ఇచ్చిన దర్శకులకి తన ఈ 48 ఏళ్ల కెరీర్ లో అడుగడుగునా నన్ను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి తను నిరంతరం కృతజ్ఞత పూర్వకంగా ఉంటాను కాబట్టే అది తన ఫేస్ లో రిఫ్లెక్ట్ అయ్యి ఇలా ఇంత వయసు వచ్చినప్పటికీ అది బయటపడకుండా ఇలా యంగ్ గా ఉంటున్నాని చెప్పుకొచ్చారు.ఆ కృతజ్ఞత చూపడం వల్లే మానసిక ప్రశాంతత లభిస్తుందని,అది ఇన్నర్ పీస్ గా మారి ఇలా మొహంలో కన్పిస్తుందని అసలు విషయం తెలిపారు.

మొత్తంగా మనం ఈ స్థాయికి రావడంలో తోడ్పడ్డ వారందరికీ కృతజ్ఞత చూపడం అనేది చాలా ముఖ్యం అని.అదే మనల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని చిరు మాటలని బట్టి అర్థం అవుతుంది.నిజానికి చిరు కెరీర్‌ను చూస్తే ఆయన చెప్పిన “కృతజ్ఞత” అనే మాట కూడా చాలా సరిగ్గా సెట్ అవుతుందనడంలో సందేహం లేదు.అవును కెరీర్ మొదట్లో చిన్న పాత్రలతో మొదలెట్టి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం వెనుక ఎంతో మంది తోడ్పాటు ఉంది.

కెరీర్ విషయానికి వస్తే

చిరు కెరీర్ విషయానికి వస్తే ఖైదీ, ఘరానా అల్లుడు , ఇంద్ర ,టాగూర్ వంటి సినిమాలతో కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ గా నిలిచిన చిరు స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘ఆపద్బాంధవుడు’ లాంటి సినిమాలతో తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు.కామెడీ అయినా, యాక్షన్ అయినా, ఫ్యామిలీ ఎమోషన్ అయినా, డ్యాన్స్ అయినా చిరంజీవి తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను మెప్పించారు.

ఇంకెంత కాలం ఆడియన్స్ ని అలరిస్తారో

ఇక పాలిటిక్స్ తో  కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే . ఆ సినిమా తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’అంటూ సినిమాలు చేసిన చిరు రీసెంట్ గా మన శంకర వర ప్రసాద్ తో సాలిడ్ సక్సెస్ ని అందుకుని ఇపుడు కాకా అంటూ పలకరించడానికి రెడీ అయిపోయాడు.చూడాలి మరి 72 ఏళ్ల వయసులో కూడా దూసుకుపోతున్న చిరు ఇంకెంత కాలం ఆడియన్స్ ని అలరిస్తారో !

also read :రూ.150 కోట్లతో కర్ణుడి కథ..లారెన్స్ లుక్ చూస్తే పూనకాలే!

Tags

Related News

నాని ‘ది ప్యారడైజ్’కు రూ.200 కోట్ల టార్గెట్.. సినిమా ఏం చేస్తుందో?

రూ.150 కోట్లతో కర్ణుడి కథ..లారెన్స్ లుక్ చూస్తే పూనకాలే!

48 ఏళ్ల సినీ ప్రయాణం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

మనల్ని ఎవరు ఆపలేరు…థియేటర్లు తగలబడి పోవాల్సిందే..నాని స్పీచ్ వైరల్!

నాని సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టికెట్ ధరలు!

నాని గ్రాండ్ ఎంట్రీ… దిష్టి తీసిన యాంకర్ సుమ!

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!

Big Stories

Advertisement
×