Chiranjeevi 48 Years:చిరంజీవి ..ఈ పేరు చెబితే చాలు థియేటర్లు దద్దరిల్లుతాయి.బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ కురిపిస్తుంది.ఇక పేరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే ఎంతో మంది తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకి వెళ్ళిన వారున్నారు.
అలా తెలుగు తెరపై నాలుగు దశాబ్దాలుగా నెంబర్ వన్ గా రాణిస్తున్న చిరు నేటికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 48 ఏళ్లుపూర్తయ్యాయి.తన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22న విడుదలయిన సంగతి తెల్సిందే.ఇక ఈ సందర్భంగా తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ వదిలారు మెగా స్టార్ చిరు.
నేటితో 48 వసంతాలు
“ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది” ఈ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించానని, ఎన్నో విజయాలను చూశానని, అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. అయితే ఇవన్నీ తనకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ.. ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ మాత్రం అన్నింటికంటే గొప్పదని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో తను కెరీర్ మొదలెట్టిన కొత్తలో ఎంతో మంది నిర్మాతలు తనని నమ్మి,ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు.ఇక తనలోని నటుడిని వెలికి తీసి ఎన్నో డిఫరెంట్ రోల్స్ ఇచ్చిన దర్శకులని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు చిరు.ఇక ఒక సినిమా వెనకాల హీరో ఒక్కరే ఉండరని,ఎంతో మంది యాక్టర్స్, టెక్నీషియన్స్ శ్రమ ఉంటుందని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.
సినీ కెరీర్ విషయానికి వస్తే
చిరంజీవి సినీ కెరీర్ విషయానికి వస్తే ..మొదటగా పునాదిరాళ్ళు అనే సినిమాలోనే నటించినప్పటికీ,ప్రాణం ఖరీదు సినిమా మొదటగా విడుదల అయ్యింది. . వాసు దర్శకత్వంలో వచ్చిన సినిమాలో చంద్రమోహన్, రావు గోపాలరావు, జయసుధ, మాధవి, రేష్మా రాయ్, నూతన్ ప్రసాద్, చలం ముఖ్య పాత్రలు పోషించారు.ఇక వెర్సటైల్ యాక్టర్ కోట శ్రీనివాస రావు కి కూడా ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.
అలా 1978లో ‘ప్రాణం ఖరీదు’తో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన చిరు ఆ తర్వాత ఎక్కడా వెనుతిరిగి చూసుకోకపోవడం విశేషం.అలా క్రమంగా ‘మనవూరి పాండవులు’, ‘ఇది కథ కాదు’, ‘పున్నమి నాగు’ న్యాయం కావాలి వంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.ముఖ్యంగా 1983లో వచ్చిన ‘ఖైదీ’ సినిమాతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో స్థిరపడిపోయాడు.
ఒక్కసారిగా ఇండస్ట్రీ టాప్ లీగ్
ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఛాలెంజ్’, ‘రుద్రవీణ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముఠా మేస్త్రి’ వంటి సినిమాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీ టాప్ లీగ్ లోకి దూసుకొచ్చాడు.ఇక హిట్లర్’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ వంటి సినిమాలతో నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు మెగాస్టార్.
ముఖ్యంగా ‘ఇంద్ర’ తర్వాత చిరంజీవి మాస్ ఇమేజ్ మరో స్థాయికి వెళ్లిందనే చెప్పాలి. ‘ఠాగూర్’లో అవినీతిపై పోరాడే పాత్రలో కనిపించిన చిరు కి బ్రహ్మ రథం పట్టారు ఆడియన్స్.ఆ తర్వాత ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో తన కామెడీ టైమింగ్‌తో ఎలా మెప్పించాడో చెప్పక్కర్లేదు.
సోషల్ మీడియాలో వైరల్
ఇక చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’తో వెండితెరకు గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన చిరు ‘సైరా నరసింహారెడ్డి’ ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ ,మన శంకర వర ప్రసాద్ అంటూ హిట్టు,ప్లాపులకి అతీతంగా అభిమానుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు.స్టార్ హీరోగా చిరు తన జర్నీ ని మాత్రమే కాకుండా.. తన వెనుక నిలిచిన ప్రతి ఒక్కరినీ గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన కృతజ్ఞతలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.