Mahaveer Karna:ఒకప్పుడు పౌరాణిక సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా తెరకెక్కేవి.కానీ క్రమమంగా ఆ ప్లేసు ని మిగతా జానర్లు భర్తీ చేసేశాయి.ఇపుడు టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతుండటంతో మళ్ళీ పౌరాణికాలని మరింత గ్రాండియర్ గా తెరపైకి తెచ్చేందుకు రెడీ అయిపోతున్నారు మన మేకర్స్.
‘మహావీర్ కర్ణ’ గా లారెన్స్
ఈ క్రమంలోనే నేనూ ఓ పౌరాణిక సినిమాని భారీ బడ్జెట్లో చేసేస్తానంటూ రెడీ అయిపోయాడు డైరెక్టర్ ,యాక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.‘మహావీర్ కర్ణ’ అంటూ తన కెరీర్ లో మొదటిసారిగా పౌరాణిక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయగా,కర్ణుడి పాత్రలో లారెన్స్ కనిపిస్తున్న ఈ పోస్టర్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు కెరీర్ లో కామెడీ, యాక్షన్,మాస్, హారర్ అంటూ తనదైన ముద్ర వేసిన లారెన్స్.. ఇప్పుడు పూర్తిగా సరికొత్త పాత్రలో కనిపించనుండటం తో సినిమా ఎలా ఉండబోతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్
ఇక ఈ సినిమాని రమేశ్ వర్మ దర్శకత్వంలో పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడ, ఆర్‌వి స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారన్న టాక్ రావడంతో ఆశ్చర్యపోతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమాని ప్యాన్ ఇండియా టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తుంది.
ఇక సినిమా విషయానికి వస్తే కేవలం పాత్రను చూపించడం మాత్రమే కాకుండా కర్ణుడి కాలాన్ని ప్రేక్షకులకు కళ్లముందు నిలిపేలా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పురాతన రాజ్యాలు, యుద్ధభూములు, భారీ సైన్యాలు, ఆయుధాలు, రాజభవనాలు వంటి అంశాల కోసం భారీ సెట్లను సిద్ధం చేస్తున్నారని సమాచారం. సినిమాకు అవసరమైన విజువల్ ఎఫెక్ట్స్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించి ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట మేకర్స్.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. మొత్తానికి రూ.150 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్, భారీ విజువల్స్, తొలిసారి పౌరాణిక పాత్రలో లారెన్స్.. ఇవన్నీ కలిపి ‘మహావీర్ కర్ణ’ను ఇంట్రెస్టింగ్ గా మార్చాయనే చెప్పాలి.
ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది బాహుబలి
అయితే ఈ మధ్య పౌరాణిక సినిమాలని సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని తెరకెక్కించే ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది బాహుబలి సినిమా అనే చెప్పాలి. ఇక ఆ కోవలోనే ‘కల్కి 2898 ఏడీ’ ‘కార్తికేయ 2’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేయడంతో ఇపుడు మరిన్ని సినిమాలు ఇదే బాట పట్టేస్తున్నాయి.అయితే ఆదిపురుష్ వంటి సినిమాలు బోల్తా పడ్డ సంగతీ మనం మర్చిపోకుడదు.
also read :48 ఏళ్ల సినీ ప్రయాణం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
చూడాలి మరి కర్ణుడిగా లారెన్స్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో !’