E-Paper
Advertisement

నాని ‘ది ప్యారడైజ్’కు రూ.200 కోట్ల టార్గెట్.. సినిమా ఏం చేస్తుందో?

నాని ‘ది ప్యారడైజ్’కు రూ.200 కోట్ల టార్గెట్.. సినిమా ఏం చేస్తుందో?
Advertisement

The Paradise:దసరా సినిమాతో రూటు మార్చిన నాని ఇపుడు ‘ది ప్యారడైజ్’ అంటూ మరో యాక్షన్ బోనాంజ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా సినిమా వంద కోట్ల వసూల్లని రాబట్టడంతో ఇదే కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై అంచనాలు స్కై లెవెల్ కి వెళ్ళిపోయాయి.

ఇక సినిమా కూడా దసరా కన్నా మరింత రా అండ్ ఇంటెన్స్‌గా ఉండబోతుందనే టాక్‌తో సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక వారందరి వెయింటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయిపొయింది.ఇక ఈ సినిమాపై ఉన్న బజ్ ని క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ సెప్టెంబర్ 23 నుంచే ప్రీమియర్ షో ప్లాన్ చేశారు కూడా.

Advertisement

అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి జోరు

అయితే సినిమాకి వస్తున్న బజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి జోరు కనిపిస్తుందట. అవును.. మొదటి నాలుగు రోజులకు కలిపి ఇప్పటికే దాదాపు 75 వేల టికెట్లు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఇక బ్లాక్ సీట్లను కూడా లెక్కేస్తే ఈజీగా ఈ సినిమా ప్రీ-సేల్స్ రూ.8 కోట్లకు పైగానే వెనకేసినట్టు తెలుస్తుంది.ఇక వీటిలో మేజర్ పార్ట్ మొదటి రోజు బుకింగ్స్ నుండే రావడం గమనార్హం.విడుదల అయ్యే సెప్టెంబర్ 24న ఒక్కరోజుకే దాదాపు 59 వేల టికెట్లు బుక్ అయ్యాయని, వెయ్యికి పైగా షోలలో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తుంది.

Advertisement

థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.105 కోట్లు 

అయితే ఈ హైప్‌ ఒక రేంజ్ లో ఉన్నప్పటికీ ‘ది ప్యారడైజ్’అందుకోవాల్సిన టార్గెట్ అంత చిన్నగా ఏమీ లేదు. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.105 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తుంది.అంటే బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుందన్న మాట.సో సినిమాకి మొదటి రోజు మొదటి ఆటకి వినబడే టాకే సినిమా రెండొందల కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అన్నది తెల్చేస్తుంది.

సాలిడ్ హిట్ అయితే కాని

నిజానికి నానికి ఈ టార్గెట్ చాలా పెద్దదే.ఎందుకంటే నాని గత సినిమాలు హిట్: ది థర్డ్ కేస్’ వరల్డ్ వైడ్ గా సుమారు రూ.120కోట్ల గ్రాస్ సాధించగా, ‘దసరా’ దాదాపు రూ.117 కోట్ల దగ్గరలో ఆగిపోయింది.ఇక ‘సరిపోదా శనివారం’ సుమారు రూ.99కోట్లు, ‘హాయ్ నాన్న’ దాదాపు రూ.77కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది.అంటే సాలిడ్ హిట్ అయితే కాని నాని గట్టిన పడడు అన్న మాట.

సినిమా విషయానికి వస్తే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని కి జోడీగా కాయదు లోహర్ నటిస్తుండగా, రాఘవ్ జుయల్, మోహన్ బాబు, సోనాలీ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం కూడా సినిమాకు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.

also read :ఇంత యంగ్‌గా ఎలా ఉంటారు? చిరంజీవి చెప్పిన ఆన్సర్ ఇదే!

సెప్టెంబర్ 24 న ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో !

అయితే సినిమా నుండి వచ్చిన గ్లిమ్ప్స్ కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ,మొదటగా వచ్చిన ఆయాషేర్ , రీసెంట్ గా వచ్చిన ఏషనాగుల కట్ట మీద పాటలు ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేయడంతో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి . చూడాలి మరి దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్ తో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24 న ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో !

Tags

Related News

ఇంత యంగ్‌గా ఎలా ఉంటారు? చిరంజీవి చెప్పిన ఆన్సర్ ఇదే!

రూ.150 కోట్లతో కర్ణుడి కథ..లారెన్స్ లుక్ చూస్తే పూనకాలే!

48 ఏళ్ల సినీ ప్రయాణం.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!

మనల్ని ఎవరు ఆపలేరు…థియేటర్లు తగలబడి పోవాల్సిందే..నాని స్పీచ్ వైరల్!

నాని సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టికెట్ ధరలు!

నాని గ్రాండ్ ఎంట్రీ… దిష్టి తీసిన యాంకర్ సుమ!

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!

Big Stories

Advertisement
×